గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్ లో తన కెరీర్ పీక్ స్టేజ్ లో వున్నప్పుడే ఈ భామ బాలీవుడ్ కి చెక్కేసింది. తన జీరో సైజ్ అందాలతో ఇలియానా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది. బర్ఫీ సినిమాతో మంచి విజయం సాధించిన ఈ బ్యూటీ ఆ తరువాత బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంది. కానీ ఆ తరువాత చేసిన సినిమాలు అంతగా మెప్పించక పోవడంతో తిరిగి టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ప్రయత్నించింది. కానీ ఈ భామకు తెలుగులో కూడా అవకాశాలు రాలేదు. అయితే రీసెంట్ గా తాను తల్లి కాబోతున్నాను అని తెలిపి అందరికి షాక్ ఇచ్చింది. పెళ్లి కాకుండానే మాతృత్వపు అనుభూతిని పొందడానికి ఆమె సిద్ధం అయింది.
గత ఏప్రిల్ నెలలో తాను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని ఇలియానా మొదటి సారి ఇంస్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించింది.తన ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్ సందర్భంగా ఆమె ఓ పెద్ద నోట్ కూడా రాసింది.
తన జీవితంలో తాను మాతృత్వపు ఆనందాన్ని పొందుతానని ఎప్పుడూ అనుకోలేదని, ఇప్పుడు ఆ కల నెరవేరడంతో తానెంతో అదృష్టవంతురాలిగా భావిస్తున్నట్లు తెలిపింది. అప్పటి నుంచీ ఈ భామ ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ హెల్త్ గురించి తెలియజేస్తూ వస్తుంది.అయితే ఇప్పటివరకు తన బాయ్ ఫ్రెండ్ ఫోటోస్ మాత్రం షేర్ చేయలేదు.అయితే కొన్నిసార్లు ఓ వ్యక్తి ఫోటోస్ షేర్ చేసినప్పటికీ ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇక ఇటీవలే మరో వ్యక్తి ఫోటో షేర్ చేయగా.. అతనే ఇలియానా బాయ్ ఫ్రెండ్ కావచ్చు అనే సందేహాలు వ్యక్తం చేశారు నెటిజన్స్. అయితే ఇప్పటికీ ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ఎవరో రివీల్ చేయకుండా సస్పెన్స్ లో పెట్టింది.తాజాగా బుధవారం ఇలియానా తన బేబీ బంప్ ఫోటోను మరోసారి షేర్ చేసింది.. రెడ్ డ్రెస్ లో ఇలియానా బేబీ బంప్ చూపిస్తూ దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.మై లిటిల్ అంటూ ఆమె ఈ ఫొటోను పోస్ట్ చేసింది.ఈ ఫొటో చూసిన ఫ్యాన్స్ హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు..