JEE Advanced Results 2023: ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈ ఏడాది పరీక్షలను నిర్వహించిన గౌహతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఈ ఉదయం ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను jeeadv.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇది IIT JEE అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్. మొత్తం 360 మార్కులకు గాను 341 మార్కులు సాధించిన వావిలాల చిద్విలాస్ రెడ్డి ఆల్‌ఇండియాలో నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. ఎన్ నాగ భవ్య శ్రీ 360కి 298తో బాలికలలో టాపర్‌గా నిలిచింది. ఉమ్మడి ప్రవేశ పరీక్ష అడ్వాన్స్‌డ్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైనది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షగా పరిగణించబడుతుంది.
Also Read: New Education Policy: ఇప్పుడు డిగ్రీ నాలుగేళ్లు.. సిలబస్ మార్చిన 105 యూనివర్సిటీలు
ఈ ఏడాది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్స్‌లో 61వ ర్యాంకు సాధించిన రాజస్థాన్‌కు చెందిన ప్రభవ్ ఖండేల్వాల్ ఈరోజు ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో 6వ ర్యాంక్ సాధించాడు. కోటాలో కోచింగ్ తీసుకున్న ప్రభవ్ ఖండేల్‌వాల్ ఆరో ర్యాంక్ సాధించి టాప్ టెన్‌లో చేరాడు. ఇందుకోసం ఆయన పూర్తి క్రెడిట్‌ను విద్యానగరి కోటకు ఇచ్చారు. ప్రభవ్ ప్రాథమికంగా భరత్‌పూర్ నివాసి. అతని తండ్రి మనోజ్ గుప్తా బ్యాంకర్ కాగా, తల్లి రేఖా గుప్తా గృహిణి. ప్రభవ్ ఒక్కడే సంతానం. అందుకే అతని తల్లి కోటాలో తన దగ్గరే ఉండి రెండేళ్లుగా ప్రిపేర్ చేస్తోంది. దీంతో ఆయన విజయం సాధించారు.
ఈ నెల 4వ తేదీన పరీక్షను నిర్వహించగా ఇప్పటికే ప్రాథమిక కీని విడుదల చేశారు. ఇక, ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రవేశ పరీక్షకు దాదాపు 1.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులు ఉన్నారు. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన వావిలా చిద్విలాస్ రెడ్డి జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో టాపర్‌గా నిలిచారు. అతడు 360 గానూ 341 మార్కులు సాధించారు. ఇక, అమ్మాయిల కేటగిరిలో 298/360 స్కోరు సాధించిన నాయకంటి నాగ భవ్యశ్రీ టాపర్‌గా నిలిచారు. ఆమె కూడా హైదరాబాద్ జోన్‌కు చెందినవారే. అయితే కామన్ ర్యాంక్ లిస్ట్‌లో ఆమె 56వ స్థానంలో నిలిచారు.
టాప్ 10 అభ్యర్థుల పేర్లు..
1.వావిలాల చిద్విలాస్ రెడ్డి
2.రమేశ్ సూర్య తేజ
3.రిషి కార్ల
4.రాఘవ్ గోయల్
5.అడ్డగాడ వెంకట శివరామ్
6. ప్రభవ్ ఖండేల్వాల్
7. బిక్కిన అభినవ్ చౌదరి
8. మలయ్ కేడియా
9. నాగిరెడ్డి బాలాజీ రెడ్డి
10. యక్కండి ఫని వెంకట మానేందర్ రెడ్డి.
ఫలితాల కోసం.. క్లిక్ చేయండి..