IIT faculty : ఐఐటీ ప్రొఫెసర్ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణమేంటో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IIT Faculty: అస్సాంలోని నార్త్ గౌహతి ప్రాంతంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెసిడెన్షియల్ క్వార్టర్‌లో ఐఐటీ గౌహతి ప్రొఫెసర్ ఒకరు శవమై కనిపించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. మృతుడు గణిత విభాగంలో అధ్యాపకుడు, 47 ఏళ్ల డాక్టర్ సమీర్ కమల్‌గా గుర్తించారు. శుక్రవారం సాయంత్రం ఐఐటీ గౌహతి క్వార్టర్స్‌లోని ఒక గదిలోంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కమ్రూప్ జిల్లా ఎస్పీ హితేష్ రాయ్ తెలిపారు. రెండు-మూడు రోజుల క్రితమే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తాము అనుమానిస్తున్నామని.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి పంపారని ఆయన చెప్పారు.
Traffic Challan: ఇది ఉంటే మీరు సేఫ్.. ట్రాఫిక్ పోలీసులు అస్సలు చలానా వేయలేరు
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
తాళం వేసి ఉన్న ప్రొఫెసర్ క్వార్టర్స్ నుంచి దుర్వాసన వస్తోందని ఐఐటీ గౌహతి నుంచి శుక్రవారం సమాచారం అందిందని పోలీసులు వెల్లడించారు. అనంతరం జిల్లా మేజిస్ట్రేట్ సమక్షంలో తలుపు తెరిచామని ఎస్పీ వెల్లడించారు. క్వార్టర్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు కమల్ ఉరివేసుకుని మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఐఐటీ గౌహతి కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. మరణించిన ప్రొఫెసర్ కుటుంబానికి ఈ విషయాన్ని తెలియజేసింది. ప్రొఫెసర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. తాము పోలీసు విచారణకు సహకరిస్తామని, కమిషన్ కూడా వేస్తామని ఐఐటీ గౌహతి ప్రకటించింది. ఈ విషయంపై అంతర్గత విచారణ చేపడతామని ప్రకటించింది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!