IND vs NEP: నేపాల్‌తో మ్యాచ్ రద్దయితే.. భారత్ పరిస్థితి ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How can India qualify for Asia Cup 2023 Super Fours after washout vs Pakistan: సుదీర్ఘకాలం తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. దాంతో దాయాదుల మ్యాచ్‌తో అసలుసిసలు మజాను ఆస్వాదిద్దామనుకున్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. పల్లెకెలె వేదికగా శనివారం దాయాదుల మధ్య జరిగిన పోరులో వర్షం అంతరాయాల నడుమ భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. ఆపై వర్షం భారీగా పడడంతో.. పాక్ ఇన్నింగ్స్ ఆరంభం కాకుండానే మ్యాచ్ రద్దయింది. ఇక సోమవారం (సెప్టెంబరు 4) పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, నేపాల్ మధ్య మ్యాచ్ జరగనుంది.
భారత్, నేపాల్ మ్యాచ్‌కూ వర్ష ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో 90 శాతం వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతవారణ శాఖ వెల్లడించింది. సోమవారం ఉదయం నుంచి అక్కడ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. వర్షం ప్రభావంతో టాస్ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందట. మ్యాచ్ జరిగే సమయంలో జల్లులు ఆటకు అంతరాయం ఏర్పడే అవకాశముందని సమాచారం. ఇప్పటికే ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. నేపాల్ మ్యాచ్ కూడా రద్దయితే భారత్ పరిస్థితి ఏంటి? అని ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
Also Read: Ishan Kishan: విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్!
వర్షం కారణంగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రద్దు కావడంతో.. ఇరు జట్ల ఖాతాలో చెరో పాయింట్ చేరింది. గ్రూప్-ఏలో నేపాల్‌పై విజయం సాదించిన పాకిస్థాన్.. టీమిండియా మ్యాచ్ రద్దు అవడంతో వచ్చిన ఒక పాయింట్‌తో కలిపి (3 పాయింట్స్) సూపర్-4కు దూసుకెళ్లింది. నేపాల్‌తో మ్యాచ్ జరిగి.. రోహిత్ సేన విజయం సాధిస్తే మూడు పాయింట్లతో భారత్ సూపర్-4కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ వరుణుడి ఆటంకంతో భారత్, నేపాల్ మ్యాచ్ కూడా రద్దయితే.. రెండు పాయింట్లతో భారత్ సూపర్-4కు అర్హత సాధిస్తుంది. అప్పుడు నేపాల్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇక సూపర్-4లో భాగంగా సెప్టెంబరు 10న భారత్, పాకిస్థాన్ మరోసారి తలపడతాయి.
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!