NTV Telugu Site icon

Shocking : కరోనా తర్వాత పెరిగిన గుండెపోటు మరణాలు.. ఐసీఎంఆర్‌ అధ్యయనంలో షాకింగ్ విషయాలు

New Project (4)

New Project (4)

Shocking : కొన్ని నెలలుగా గుండెపోటుకు సంబంధించిన షాకింగ్ ఘటనలు భారీగా వెలుగు చూస్తున్నాయి. పెళ్లి సమయంలో కళ్యాణ మండపంలో గుండెపోటుతో కొందరు, క్రికెట్ ఆడుతూ కొందరు చనిపోతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత, ఇలాంటి సంఘటనల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగినట్లు అనిపిస్తోంది. ఈ ఘటనలు చూస్తుంటే గుండెపోటు మరణాలకు కరోనాతో సంబంధం ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. దీన్ని తెలుసుకునేందుకు ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవ్య వెల్లడించారు.

గుండెపోటు, కోవిడ్ కారణంగా సంభవించే మరణాల మధ్య సంబంధాన్ని అంచనా వేయడానికి ICMR అధ్యయనం చేస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. దీని ఫలితాలు 2 నెలల్లో రానున్నాయి. మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ… కరోనా తర్వాత గుండెపోటు మరణాల రేటు పెరిగిందని అంగీకరించాడు. దీనిపై ఐసీఎంఆర్‌ అధ్యయనం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న టీకా గణాంకాలు ఆధారంగా ICMR గత 3-4 నెలలుగా అధ్యయనం కొనసాగిస్తోందన్నారు. ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఈ అధ్యయన నివేదిక వచ్చే రెండు నెలల్లో వస్తుందని మాండవియా చెప్పారు.

Read Also: Weight Loss : దట్ ఈజ్ ఆర్య.. ఏకంగా 114కేజీలు తగ్గిచూపించాడు

ఢిల్లీలోని ఎయిమ్స్ గుండెపోటు కారణంగా మరణించిన వారి డేటాను కూడా సమీక్షిస్తోంది. భారతదేశ అవసరాలను తీర్చడమే కాకుండా ఎగుమతి కోసం కూడా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచామని మాండవియా పేర్కొన్నారు. భారతదేశం వినాశకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని మొదట్లో చెప్పామని కేంద్ర మంత్రి అన్నారు. కానీ నేడు భారతదేశం అత్యుత్తమ వ్యాక్సిన్ ప్రచారం, కరోనా నిర్వహణ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుందన్నారు. బిల్ గేట్స్ కూడా భారత్‌పై ప్రశంసలు కురిపించారని చెప్పారు.

Read Also: Raviteja: వాడికి సలహాలు ఇవ్వను.. అసలు నాకు సంబంధం కూడా లేదు

ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, 50ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో 50%, 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో 25% మంది గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం ఉంది. అంటే యువతలో గుండెపోటు రేటు పెరుగుతోందని, మహిళల కంటే పురుషులే ఎక్కువగా గుండె జబ్బులతో బాధపడుతున్నారని అర్థం. అధిక రక్తపోటు, షుగర్, ఒత్తిడి, ఊబకాయం, తగినంత నిద్ర లేకపోవడం, క్రమబద్ధమైన జీవనశైలి గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా పరిగణించబడతాయి. కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత శరీరంలో రక్తం గడ్డకట్టే రేటు వేగంగా పెరిగిందని, ఈ పెరిగిన గుండె జబ్బుతో కరోనాకు ఏదైనా సంబంధం ఉందా అని నిర్ధారించడానికి అధ్యయనాలు కూడా జరుగుతున్నాయని చాలా మంది నిపుణులు ఊహించారు.