Australia announce preliminary squad for ICC ODI World Cup 2023: ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5న ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 18 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాథమిక జట్టు (ప్రిలిమినరీ స్క్వాడ్)ను ప్రకటించింది. ఈ జట్టులో ఆసీస్ స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌కు చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా ప్రిలిమినరీ స్క్వాడ్‌లో ఇద్దరు కొత్త ఆటగాళ్లకు చోటు దక్కింది.
అన్‌క్యాప్డ్ లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా, అనుభవం లేని ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీకి వన్డే ప్రపంచకప్ 2023 ఆస్ట్రేలియా ప్రాథమిక జట్టులో చోటు దక్కింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. సెప్టెంబరు 28కి ముందు అన్ని టీమ్స్ తమ జట్లను ప్రకటించాలి. ఇప్పుడు ఆసీస్ 18 మందితో కూడిన జట్టును ప్రకటించినా.. టోర్నీ ఆరంభానికి ముందు 15 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటిస్తుంది. ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్ అక్టోబరు 8న చెన్నైలో ఆతిథ్య భారత్‌తో ఆడుతుంది.
ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన యాషెస్ 2023లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ గాయపడ్డాడు. అతడు మణికట్టు గాయంతో బాధపడుతున్నాడు. కమ్మిన్స్‌కు ఆరు వారాల విశ్రాంతి అవసరం అని వైద్యబృందం సలహా ఇచ్చింది. దాంతో కమ్మిన్స్ ప్రపంచకప్ ప్రారంభానికి ముందే తిరిగి జట్టులోకి రానున్నాడు.
Also Read: Hardik Pandya: అతడి వల్లే మ్యాచ్ ఓడిపోయాం: హార్దిక్ పాండ్యా
వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌తో ఆస్ట్రేలియా ప్రపంచకప్‌కు సన్నద్ధమవనుంది. ఈ మ్యాచ్‌లలో తన్వీర్ మరియు హార్డీ వంటి వారికి అవకాశం ఇవ్వనుంది. తన్వీర్ ఆస్ట్రేలియా మునుపటి టీ20 పర్యటనలలో భాగమైనప్పటికీ.. ఇంకా అరంగేట్రం చేయలేదు. స్పిన్ అనుకూలమైన భారత పిచ్‌లలో అష్టన్ అగర్ మరియు ఆడమ్ జంపాతో కలిసి అతడు ఆడే అవకాశం ఉంది. ఆరో ప్రపంచకప్ టైటిల్‌ను (1987, 1999, 2003, 2007 and 2015) కైవసం చేసుకునేందుకు ఆసీస్ బరిలోకి దిగుతోంది. చివరిసారి జరిగిన 2019 ప్రపంచకప్ టైటిల్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా ప్రాథమిక ప్రపంచకప్ జట్టు (Australia Initial Squad):
పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.
Also Read: Hyderabad News: మద్యం మత్తులో యువకుడి వీరంగం.. నడి రోడ్డుపైనే యువతిని వివస్త్రను చేసి..!