NTV Telugu Site icon

SL vs BAN: శ్రీలంకపై 2 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం..

Ban Vs Sl

Ban Vs Sl

SL vs BAN: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో మరో సంచలన విజయం నమోదైంది. శ్రీలంకను బంగ్లాదేశ్‌ ఓడించేంది. పెద్ద జట్లకు చిన్న టీమ్స్ దడపుట్టిస్తున్నాయి. అమెరికాలోని డల్లాస్‌ వేదిక జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ దెబ్బకు లంక కేవలం 124 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంకా ఒక్కడే 47 రన్స్ తో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఇక, తక్కువ స్కోర్‌ను కాపాడుకునేందుకు లంక బౌలర్లు బాగా కష్టపడినా.. టార్గెట్ చిన్నది కావడంతో మ్యాచ్‌ ఓడిపోయారు. అలాగే, బంగ్లాదేశ్‌ బ్యాటర్లు కూడా బ్యాటింగ్ చేసేందుకు చాలా ఇబ్బంది పడినా.. చివరికు గెలిచేశారు.

Read Also: Cricket Stadium: దక్షిణ భారత్లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

అయితే, శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లు మధ్య మ్యాచ్ హైటెన్షన్ లో నడిచింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ అంటే శ్రీలంక ప్లేయర్స్, లంకతో మ్యాచ్‌ అనగానే బంగ్లా ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడేస్తున్నారు. ఇక, మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 రన్స్ చేసింది. ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంకా 47, ధనంజయ డిసిల్వా 21 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లంతా విఫలం కావడంతో శ్రీలంక తక్కువ స్కోర్‌కే పరిమితిం అయింది.

Read Also: Group 1 Prelims Exam: రేపు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ఇక, బంగ్లాదేశ్‌ బౌలర్లలో ముస్తఫీజుర్‌ 3, రిషాద్‌ హుస్సేన్‌ 3 వికెట్లు తీసుకోగా.. టస్కిన్‌ అహ్మద్‌ రెండు వికెట్లు తీశాడు. కాగా, 125 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 6 పరుగులకే ఓపెనర్లు పెవిలియన్ బాటపట్టారు. కానీ, లిట్టన్‌ దాస్‌ 36, తౌహిద్ 40 పరుగులతో రాణించారు. ఈ ఇద్దరు మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. చివర్లో మహ్మదుల్లా 13 బంతుల్లో 16 రన్స్ చేసి జట్టు విజయానికి కృషి చేశాడు. మొత్తానికి 19 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగుల టార్గెట్ ను బంగ్లాదేశ్ ఛేజించింది. లంక బౌలర్లలో నువాన్‌ తుషారా 4 వికెట్లు తీసుకున్నాడు.