NTV Telugu Site icon

ICC T20I Ranking: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో.. ‘సూర్య భాయ్’ టాప్..

Surya

Surya

బుధవారం ఐసీసీ బ్యాట్స్‌మెన్ టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. అందులో టీమిండియా స్టార్ ప్లేయర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్.. నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. కాగా.. ఇంతకుముందు నెంబర్ వన్ స్థానంలో ఉన్న పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. టాప్-10లో టీమిండియా ఆటగాళ్లు ఇద్దరు చోటు దక్కించుకున్నారు. మరొక బ్యాటర్ యశస్వీ జైస్వాల్.. అతను ఆరో స్థానంలో ఉన్నాడు.

ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ 802 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ 784 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ ఒక స్థానం కోల్పోయాడు. ఒక్క స్థానం దిగజారి ఐదు ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ ఆరో స్థానంలో ఉన్నాడు. కాగా.. ఐసీసీ బ్యాట్స్‌మెన్ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య, జైస్వాల్‌ మినహా మిగతా టీమిండియా ఆటగాళ్లు టాప్‌ టెన్‌లో చోటు దక్కలేదు.

Read Also: Rinku Singh: తుది జట్టులో లేనని తెలిసి గుండె పగిలినట్లైంది.. తల్లితో రింకూ సింగ్ భావోద్వేగం

ICC T20I బ్యాటింగ్ ర్యాంకింగ్స్
సూర్యకుమార్ యాదవ్ – 861
ఫిల్ సాల్ట్ – 802
మహ్మద్ రిజ్వాన్ – 784
బాబర్ ఆజం – 763
ఐడెన్ మార్క్రామ్ – 755
యశస్వి జైస్వాల్ – 714
రిలే రోసౌ – 689
జోస్ బట్లర్ – 680
రీజా హెండ్రిక్స్ – 660
డేవిడ్ మలన్ – 657

బౌలర్ల టీ20 ర్యాంకింగ్స్‌
ఇక.. బౌలర్ల టీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌కు చెందిన ఆదిల్ రషీద్ మొదటి స్థానంలో ఉన్నాడు. టాప్ టెన్‌లో ఇద్దరు భారత ఆటగాళ్లు ఉన్నారు. అక్షర్ పటేల్ 660 పాయింట్లతో నాలుగో స్థానంలో, రవి బిష్ణోయ్ 659 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నారు.

Show comments