IBM: 15ఏళ్లుగా లీవ్ పెట్టి జీతం పెంచట్లేదని కోర్టుకు వెళ్లిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IBM: కరోనా కారణంగా ప్రపంచం మొత్తం తలకిందులైపోయింది. ఎన్నో లక్షల ఉద్యోగాలు ఉష్ కాకి అయ్యాయి. ఇప్పుడిప్పుడే మహమ్మారి నుంచి కోలుకుంటున్న సందర్భంలో మళ్లీ ఆర్థికమాంద్యం అంటూ చాలా కంపెనీలు ఉన్న జాబుల్లో కోత విధిస్తున్నాయి. ఉన్న జాబు పోకుండా ఉండాలని కోరుకుంటున్న తరుణంలో ఓ సీనియర్ ఐటీ ఎంప్లాయ్ అత్యాశతో కోర్టును ఆశ్రయించాడు. సదరు ఉద్యోగి 2008 నుంచి సిక్ లీవ్‌లో ఇంటి పట్టునే ఉన్నాడు. అతనికి కంపెనీ రూల్స్ ప్రకారం నెలరాగనే ఠంఛన్ గా సాలరీ అందుతూనే ఉన్నది. కానీ, తనకు వస్తున్న జీతం సరిపోవడం లేదని కంపెనీ పెంచట్లేదని కోర్టును ఆశ్రయించాడు. 15 ఏళ్లుగా సిక్ లీవ్‌లో ఉన్న ఐబీఎం ఉద్యోగి ఇయాన్ క్లిఫర్డ్‌కు సంబంధించిన స్టోరీ ఇది. లింక్‌డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన 2013 నుంచి మెడికల్లీ రిటైర్డ్.
Read Also:Pinarayi Vijayan: తగిన గుణపాఠం చెప్పారు.. కర్ణాటక ఎన్నికలపై కేరళ సీఎం కీలక వ్యాఖ్యలు
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
డిజేబిలిటీ డిస్క్రిమినేషన్‌కు తాను బాధితుడినని అతను చెప్పుకుంటున్నాడు. 15 ఏళ్లుగా తనకు వస్తున్న జీతంలో హైక్ లేదని పేర్కొంటున్నాడు. ఐబీఎం కంపెనీ ప్లాన్ ప్రకారం, ఆ ఐటీ స్పెషలిస్ట్ ఏడాదికి 54 వేల పౌండ్లకు మించి జీతం అందుకుంటున్నాడు. ఆయనకు 65 ఏళ్లు నిండే వరకు ఇలా జీతం వస్తూనే ఉంటుంది. అలా హెల్త్ ప్లాన్ ఉండటమే గొప్ప. కానీ, ఆ ఉద్యోగి మాత్రం ఆ ప్లాన్ సరిగా లేదని, ద్రవ్యోల్బణంతో తన జీతం రాను రాను విలువ తగ్గిపోతుందని వాదిస్తున్నాడు. ఇయాన్ క్లిఫర్డ్ 2008 సెప్టెంబర్‌లో సిక్ లీవ్ పై వెళ్లాడు. 2013 వరకు ఆయన సిక్ లీవ్‌లోనే ఉన్నాడు. ఆ తర్వాత తన బాధను చెప్పుకున్నాడు. ఆయన కంప్లైంట్ ఆధారంగా ఐబీఎం ఆయనకు కంప్రమైజ్ అగ్రిమెంట్ ఆఫర్ చేసింది. దీని ప్రకారం, ఆయనను కంపెనీ డిజేబిలిటీ ప్లాన్ కిందకు తీసుకుని డిస్మిస్ చేయకుండా ఉంచుతుంది. ఆయన వర్క్ చేయాల్సిన అవసరం లేదు. జీతం కూడా 75 శాతం ఇస్తారు.
Read Also:Bihar: మటన్ రైస్‌తో కాంగ్రెస్ విందు.. ఎగబడ్డ జనం.. కింద పడ్డ డీఎస్పీ
ఆయన జీతం 73,037 పౌండ్లు. 2013 నుంచి 25 శాతం కోతతో 54,028 పౌండ్లు ఆయనకు ప్రతి సంవత్సరం కంపెనీ ఇస్తుంది. కానీ, దీనిపైనా ఆ ఉద్యోగి కంపెనీని కోర్టుకు తీసుకెళ్లాడు. ఈ పిటిషన్ విచారించిన జడ్జీ హౌస్‌గో విచారిస్తూ.. రోజు ఆఫీసుకు వచ్చి యాక్టీవ్ గా వర్క్ చేస్తున్న ఉద్యోగులకు జీతం పెరుగుతుందని, పనిలో లేని ఉద్యోగికి జీతం పెంచడం ఎలా సాధ్యమవుతుందని తెలిపారు. డిజేబిలిటీ ఉన్నవారికి మిగతా ఉద్యోగులకు పెంచినట్టు జీతం పెంచడం లేదని వాదిస్తున్నారని పేర్కొన్నారు. కానీ, ఈ ప్లాన్ కేవలం డిజేబిలిటీ వారికి మాత్రమే కాబట్టి ఆ వాదన చెల్లదని అన్నారు. ఏడాదికి 50 వేల పౌండ్లు 30 ఏళ్లకు లెక్కించి అందులో సగం చేసినా భారీ మొత్తమే ఆ డిజేబిలిటీ క్యాండిడేట్ పొందుతాడని జడ్జీ తెలిపారు. ఇది డిజేబిలిటీ ఉద్యోగిని మంచిగా ట్రీట్ చేసినట్టే అవుతుందని వివరించారు.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి