ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ చేసిన చట్టవ్యతిరేక పనులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ని కదిలించింది. దీనిపై ప్రధాని కార్యాలయం దృష్టి సారించింది. ఇప్పుడు పూజా ఖేద్కర్ ఉద్యోగం ప్రమాదంలో పడింది. యూపీఎస్సీ ఆమెపై కేసు నమోదు చేసింది. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ యూపీఎస్‌సీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విషయం తొలిసారిగా ఎలా వెలుగులోకి వచ్చిందో తెలుసా? పూజా ఖేద్కర్ ఆడి కారు చిత్రాన్ని మొదటిసారి సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తి ఎవరు? ఈ విషయాన్ని తెలుసుకునేందుకు జనాలు ఎదురుచూస్తున్నారు. ఐఏఎస్ పూజా ఖేద్కర్‌ను రోడ్డు మీద నిలబెట్టిన వ్యక్తి పేరు వైభవ్ కోకట్. పూజా ఖేద్కర్ ఆడి కారు డిమాండ్ చేసిన విషయాన్ని తొలిసారి సోషల్ మీడియా ద్వారా అందరి ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఆయనే. సోషల్ మీడియా పవర్‌ని అర్థం చేసుకున్న వైభవ్.. ఓ ట్వీట్ చేయడం వల్ల ఓ ఐఏఎస్ అధికారి పెద్ద ముప్పు తెచ్చిపెట్టింది.
READ MORE: Damodara Rajanarsimha: నగదు రహిత చెల్లింపుల రద్దు నిర్ణయం ఉపసంహరణ..
జులై 6న ‘X’లో పూజా ఖేద్కర్ గురించిన సమాచారాన్ని ఫోటోతో పాటు పోస్ట్ చేశాడు వైభవ్. ఆ తర్వాత క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ పోస్ట్‌ను మీడియా దృష్టికి తీసుకెళ్లింది. దీని తర్వాత వైభవ్‌కు సామాజిక కార్యకర్తలు, ఆర్టీఐ (RTI) కార్యకర్తల నుంచి కాల్స్ వచ్చాయి. అప్పుడు పూజా ఖేద్కర్ గురించి మరింత సమాచారం బయటకి రావడం మొదలైంది. ఈ ఘటన తర్వాత పలువురు ఐఏఎస్ అధికారులు తమ సోషల్ మీడియా ఖాతాలను తొలగించారు.
READ MORE:Jitin Prasada : రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు..ఇప్పుడెలా ఉందంటే..?
వైభవ్ కోకట్ ఎవరు?
వైభవ్ బీడ్ జిల్లా కోకట్ నివాసి. సామాజిక, రాజకీయ అంశాలపై రాయడం ఆయనకు ఇష్టం. పీఆర్ కంపెనీలో కూడా పనిచేశాడు. ఎక్స్ లో అతనికి 31 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఒక రోజు ముందు.. జూలై 19 న పోలీసులు ఖేద్కర్‌పై కేసు నమోదు చేసినప్పుడు దీనిపై కూడా వైభవ్ మరొక పోస్ట్ చేశారు. “ఓ పోస్టుకు చాలా పవర్ ఉంది.. అన్యాయాన్ని ధైర్యంగా రాయండి. వ్యవస్థకు వ్యతిరేకంగా అన్యాయాన్ని నిలదీయండి. వ్యవస్థను సైతం వంచే శక్తి మీ రచనకు ఉంది.” అని పేర్కొన్నారు.