Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ias Officer Imtiaz Joins Ycp Contested As Mla From Kurnool

Kurnool MLA Candidate: వైసీపీలోకి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి.. కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ!

Published Date :February 29, 2024 , 1:48 pm
By Sampath Kumar
Kurnool MLA Candidate: వైసీపీలోకి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి.. కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

IAS Officer imtiaz Joins YCP: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైసీపీ)లో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఏఎండి ఇంతియాజ్‌ చేరారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్, కర్నూలు మేయర్‌ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఐఏఎస్‌ సీనియర్ అధికారి అయిన ఇంతియాజ్ వచ్చే ఎన్నికల్లో కర్నూలు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ విషయాన్ని వైసీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఇంతియాజ్ ఇటీవలే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గతంలో ఆయన సెర్ప్‌ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ‘సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశయాలతో కర్నూలు అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. వ్యక్తిగత సమస్యలు ఏమున్నా అందరినీ కలుపుకొని వెళ్తాను. అసమానతలు లేని సమాజం నిర్మించాలని అడుగులు వేస్తున్నా. వైసీపీ అమలు చేస్తున్న నవ రత్నాలు ప్రజలకు మేలు చేశాయి. కర్నూలు జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాం’ అని ఇంతియాజ్ అన్నారు.

Also Read: Medaram Jatara: తిరుగువారం పండుగతో ముగిసిన మేడారం జాతర

కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… ‘ఇంతియాజ్ గారితో కలిసి పని చేస్తా. ఆయనను కర్నూలులో గెలిపిస్తాం. కొండా రెడ్డి బురుజుపై వైసీపీ జెండా ఎగరెస్తాము. మాకు రాజకీయంగా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. మా రాజకీయ భవిష్యత్ కంటే పార్టీ ముఖ్యం. పార్టీ బాగుంటే మేమంతా బాగుంటాము’ అని అన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ… ‘సీఎం నిర్ణయంతో మేమంతా ఇంతియాజ్ ను గెలిపిస్తాం. మైనార్టీలకు జగన్ అండగా ఉన్నారు. మెజార్టీ స్థానాల్లో మైనారిటీలకు సీఎం అవకాశం కల్పించారు. ప్రతి ఒక్కరూ బాగుండాలని అనేది జగన్ రెడ్డి ఆలోచన. 14 యేళ్లుగా పార్టీలో ఉన్న నాకు అవకాశం లేదని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. జగన్ నిర్ణయం మేరకు నా అడుగులు ఉంటాయి. జగన్ సీఎం అవ్వడం నాకు ముఖ్యం. నేను ఎక్కడ పోటీ చేయడం లేదు. నా గౌరవం, నా స్థానం ఎక్కడ తగ్గకుండా చూస్తానని సీఎం హామీ ఇచ్చారు’ అని పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • imtiaz
  • imtiaz Kurnool
  • Kurnool MLA
  • Kurnool MLA Candidate

తాజావార్తలు

  • IPL Trophy: తొలి టైటిల్ కోసం ఎదురుచూపులు.. ఆర్సీబీనే కాదు, చెన్నై-ముంబైకి తప్పని నిరీక్షణ!

  • Vayuputra : ‘వాయుపుత్ర’కు నాగవంశీ బ్రేకులు?

  • Sunetra Pawar: పోలింగ్‌కు ముందే విక్టరీ.. బారామతిలో సునేత్ర పవార్ ‘పవర్’!

  • Jeevan Reddy : KCR పాలన బెటర్ అనే భావనతోనే BRSలో చేరుతున్నా..

  • Dale Steyn: చాలా పెద్ద తప్పు చేశాడు.. మిల్లర్ పై విరుచుకపడ్డ డేల్ స్టెయిన్..!

ట్రెండింగ్‌

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions