Site icon NTV Telugu

Rajagopal Reddy: “మంత్రి పదవి ఇవ్వాల్సిందే”.. నా మంచితనాన్ని చేతగానితనం అనుకోవద్దు..

Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy

తాను మంత్రి పదవి కోసం ఢిల్లీలో పైరవీలు చేయనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. ఖమ్మంలో 9 మంది గేలిస్తే 3 మంత్రి పదవులు వచ్చాయని తెలిపారు. మరి నల్లగొండలో 11 స్థానాలు గెలుస్తే మంత్రి పదవులు రెండేనా? అన్నారు.

READ MORE: Laser weapon: భారత అమ్ములపొదిలో ‘‘లేజర్ వెపన్’’.. క్షణాల్లో డ్రోన్‌లు ఖతం.. వీడియో వైరల్..

నల్లగొండ జిల్లాకు మరో మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని డిమాండ్‌ను లేవనెత్తారు. పార్టీ అధిష్టానం తనకు ఇచ్చిన హామీ అమలు చేయాల్సిందే? అన్నారు. తన మంచితనాన్ని, సహనాన్ని చేతగానితనం అనుకోవద్దని హెచ్చరించారు. ఒకాయన ఢిల్లీలో పైరవీలు చేస్తున్నారని.. నలుగురిని వెంటబెట్టుకొని వెళ్లి తనకు మంత్రి పదవి ఇవ్వు అని అడగాలంటే సిగ్గు అనిపిస్తుందన్నారు.

Exit mobile version