Seediri Appalaraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 రోజులుగా అతలాకుతలం అయిపోతుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ఓ పక్కా రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి.. మరో వైపు వైసీపీ హయాంలోని వచ్చిన మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు.. గూగుల్ డేటా సెంటర్ తో నకిలీ మద్యం, మెడికల్ కాలేజీల అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారు.
నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి మరోసారి రాముడి జన్మస్థలంపై చర్చను ప్రారంభించారు. రాముడు, శివుడు, విశ్వామిత్రుడు వంటి దేవతలు నేపాల్ లోనే పుట్టారని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాఠ్‌మాండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఓలి పాల్గొని ప్రసంగించారు. శ్రీరాముడు నేపాల్ లోనే జన్మించాడని పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ప్రచారం చేయడంతో దేశ ప్రజలు వెనకడుగు వేయొద్దన్నారు.
భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాని మోడీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచే పని ప్రధాని మోడీ చేశారన్నారు. గాంధీనగర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 2014 కి ముందు, ప్రతిరోజూ ఉగ్రవాద దాడులు జరిగాయని.. కానీ అప్పటి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని విమర్శించారు. కానీ ఇప్పుడు అలా కాదని శత్రు దేశానికి తగిన సమాధానం చెబుతామన్నారు. సైన్యం ఇటుకలకు రాళ్లతో ప్రతిస్పందించిందని…
తాను మంత్రి పదవి కోసం ఢిల్లీలో పైరవీలు చేయనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. ఖమ్మంలో 9 మంది గేలిస్తే 3 మంత్రి పదవులు వచ్చాయని తెలిపారు. మరి నల్లగొండలో 11 స్థానాలు గెలుస్తే మంత్రి పదవులు రెండేనా? అన్నారు.