Sandhya Theatre Incident: బాధిత కుటుంబాన్ని పరామర్శించా.. పబ్లిసిటీ చేయలేదు: జగపతి బాబు
- సంధ్య థియేటర్ ఘటన
- విమర్శలపై స్పందించిన జగపతి బాబు
- పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఎవరికీ తెలియలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలంగా మారింది. థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీతేజ్‌కు డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి.. రేవతి కుటుంబాన్ని సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ పరామర్శించట్లేదనే విమర్శలు సోషల్ మీడియాలో వచ్చాయి. తాజాగా ఈ విమర్శలపై సీనియర్ నటుడు జగపతి బాబు స్పందించారు.
Also Read: Allu Arjun: 2 వేల కోట్లు కలెక్ట్ చేశారు.. బాధిత కుటుంబానికి రూ.20 కోట్లు ఇస్తే పోయేదేముంది: మంత్రి
Also Read
- Arunachal Pradesh: అరుణాచల్‌లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
- Babar Azam: ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు బాబర్ ఆజమ్ ఎందుకు దూరమయ్యాడు? అసలు కారణం ఇదే
- Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
సంధ్య థియేటర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు తాను హాస్పిటల్‌కు వెళ్లానని, పబ్లిసిటీ చేయలేదు కాబట్టే విషయం ఎవరికీ తెలియలేదని జగపతి బాబు చెప్పారు. ‘అందరికీ నమస్కారం. ఓ క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నా. నేను సినిమా షూటింగ్ నుంచి రాగానే.. సంధ్య థియేటర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు హాస్పిటల్‌కు వెళ్లా. బాలుడి తండ్రిని, సోదరిని పలకరించాలనిపించి అక్కడకు వెళ్లా. ఆ దేవుడు, అందరి ఆశీస్సులతో త్వరగానే కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చి వచ్చాను. అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ కుటుంబం కాబట్టి.. నా వంతు సపోర్టు ఇవ్వాలనుకున్నా. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి విమర్శలు వచ్చాయి. క్లారిటీ ఇవ్వడానికే ఈ పోస్టు పెడుతున్నా’ అని జగపతి బాబు ఓ వీడియో రిలీజ్ చేశారు.
— Jaggu Bhai (@IamJagguBhai) December 22, 2024
తాజావార్తలు
-
Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’
-
Arunachal Pradesh: అరుణాచల్‌లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
-
Babar Azam: ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు బాబర్ ఆజమ్ ఎందుకు దూరమయ్యాడు? అసలు కారణం ఇదే
-
January 12 Vidudala: జనవరి 12 విడుదల.. రావిపూడి టైటిల్ అదిరిందిగా
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!