Site icon NTV Telugu

Operation Sindoor: ‘నా సిందూరాన్ని బార్డర్‌కు పంపుతున్నా’.. నవ వధువు సంచలన నిర్ణయం.!

Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor: ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో అప్రమత్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సెలవుల్లో ఉన్న భారత జవాన్లను వారి విధుల్లోకి తిరిగి రావాలని ఆర్మీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీనితో వెంటనే ఆర్మీ సైనికులు కుటుంబాలను వదిలి తిరిగి సరిహద్దుల వైపు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్ అనే భారత సైనికుడి పరిస్థితి ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

Read Also: IND PAK War: పాక్ ఎన్ని డ్రోన్స్, క్షిపణులను ప్రయోగించినా భారత్ ఇట్టే కూల్చేస్తోంది.. కారణాలేంటి?

ఈ నెల 5న అతను యామినీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు సైనికుడు మనోజ్ పాటిల్. పెళ్లయి కేవలం మూడు రోజులు కూడా కాకముందే, అతనికి ఆర్మీ నుంచి పిలుపు వచ్చింది. “ఆపరేషన్ సిందూర్” పేరిట భారత్-పాకిస్తాన్ మధ్య సైనిక కార్యకలాపాలు జరుగుతున్న దృష్ట్యా, అతను తిరిగి విధుల్లో చేర్చాల్సిన అవసరం ఏర్పడింది. అయి సమయంలో ఎవరూ ఊహించని స్థైర్యాన్ని ప్రదర్శించింది అతని భార్య యామినీ. వివాహం అయి మూడు రోజులు కూడా కాకముందే, తన భర్తను సరిహద్దుకి పంపిస్తూ “దేశ రక్షణే మాకు ముఖ్యం. అందుకోసమే నా సింధూరాన్ని బార్డర్‌కు పంపిస్తున్నా” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఈ మాటలు విన్న నెటిజన్స్ దేశభక్తికి అసలైన నిర్వచనం ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: Terrorists Killed: పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి.. ఐదుగురు కీలక టెర్రరిస్టులు హతం!

ఈ సంఘటన స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలను గుర్తుకు తెస్తోంది. “వందేమాతరం” అంటూ రైలు ఎక్కించి పంపిన దృశ్యం నాటి పోరాట స్ఫూర్తిని గుర్తు చేసింది. మన దేశంలో ఇలాంటి కుటుంబాలు ఉన్నాయంటే, ఈ నేలపై దేశభక్తి ఇంకా నిలిచే ఉందనే నమ్మకం కలుగుతోంది. ఇలాంటి వారిగురించి ఎంత చెప్పిన తక్కువే.. ఏమిచ్చి తీర్చుకోగలం వీళ్ల రుణం..! జైహింద్..!

Exit mobile version