Hyundai Xeter: మార్కెట్లోకి వచ్చిన హ్యుందాయ్ ఎక్స్టర్.. ఫీచర్లు అదిరిపోయాయి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ కొరియా దేశానికి చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా.. సోమవారం తన కొత్త మోడల్ ‘Xeter’ని విడుదల చేసింది. భారత్‌లో అధికారికంగా లాంచ్ అయిన ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ బేస్ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.5,99,900గా నిర్ణయించారు. ఇది హ్యుందాయ్ నుంచి వస్తున్న అతి చౌకైన ఎస్‌యూవీగా గుర్తింపు తెచ్చుకుంది. Xter మోడల్ 1.2 లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్‌తో అమర్చబడి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వెర్షన్లలో అందుబాటులో ఉన్నాయి.
Jawan: జవాన్ లో విజయ్.. ఇదుగో సాక్ష్యం..?
Also Read
- Hardik Pandya: మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్.. అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. $100,000 గెలుపు.!
- Pulivendula Re-Polling: రీ-పోలింగ్‌పై గందరగోళం.. పులివెందులలో ఇంకా తెరుచుకోని పోలింగ్ కేంద్రం!
- UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
- Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
హ్యుందాయ్ Xeter ఒక లీటర్ పెట్రోల్‌తో 19.4 కిలోమీటర్లు పరిగెత్తుతుందని కంపెనీ పేర్కొంది. రూ. 5.99 లక్షల నుండి ప్రారంభమై.. దాని అధిక వెర్షన్ ధరను రూ. 9.31 లక్షలుగా నిర్ణయించారు. అంతేకాకుండా ఆటోమేటిక్ వేరియంట్ మోడల్ ప్రారంభ ధర రూ. 7.96 లక్షలుగా నిర్ణయించారు. ఇది ఒక లీటర్లో గరిష్టంగా 19.2 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు. కంపెనీ ఈ మోడల్‌ను సిఎన్జి వెర్షన్లో కూడా విడుదల చేసింది. దీని ధర రూ. 8.23 లక్షలు ఉండగా.. ఇది 27.1 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.
Russia-Ukraine War: 500 రోజులుగా కొనసాగుతున్న రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం..!
ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఉన్సూ కిమ్ మాట్లాడుతూ.. మార్కెట్లోకి క్సెటర్ను ప్రవేశపెట్టడంతో అన్ని కేటగిరీల్లో ఎస్యూవీ మోడళ్లను ప్రవేశపెట్టే కంపెనీగా హ్యుందాయ్ అవతరించిందన్నారు. ఈ మోడల్ అభివృద్ధికి రూ.950 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. భారత మార్కెట్ పట్ల హ్యుందాయ్ మోటార్‌కు ఉన్న నిబద్ధతను తెలియజేస్తూ, వచ్చే పదేళ్లలో రూ. 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఇటీవలే ప్రకటించినట్లు కిమ్ తెలిపారు. తమిళనాడులో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రారంభించడం మరియు బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు.
ఈ కారు( Hyundai Exter ) డాష్ క్యామ్, ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు, సింగల్ పాన్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 8 అంగుళాల టచ్‌స్క్రీన్, కీలెస్ ఎంట్రీ, వైర్లెస్ ఛార్జింగ్, ఇన్‌బిల్ట్ నావిగేషన్, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్టెక్ వంటి అద్భుతమైన ఫీచర్లతో ఎంట్రీ ఇచ్చింది. 6 ఎయిర్ బ్యాగ్స్‌తో పాటు ESC, అన్ని సీట్లకూ సీట్‌బెల్ట్ రిమైండర్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ABS, రియర్ పార్కింగ్ సెన్సర్ వంటివి ఉన్నాయి. ఇక కారు ఇంటీరియర్ అంతా బ్యాక్ కలర్లో ఉంటుంది. కారులోని భాగాలన్నీ నలుగురంగులోనే ఉంటాయి. ఇందులో పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
-
Redmi M100 Pro: రెడ్మీ M100 Pro 5G ఫోన్ లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ధర ఎంతంటే?
-
India Bullet Train Features: 280kmph వేగం.. 8 కోచ్‌లు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
-
Hardik Pandya: మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్.. అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. $100,000 గెలుపు.!
-
Bhuvneshwar Kumar: 180 రన్స్, ఒకే వికెట్.. భువనేశ్వర్‌ను ఆడించడం పెద్ద తప్పిదం!
-
Mahindra UDO Electric Auto: మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200KM రేంజ్, 5 గంటల్లో ఫుల్ ఛార్జ్!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?