Site icon NTV Telugu

HYDRA: కూకట్‌పల్లి బాలాజీ నగర్ డివిజన్‌ హబీబ్ నగర్‌లో హైడ్రా కూల్చివేతలు.

Hydra

Hydra

HYDRA: హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లి బాలాజీ నగర్ డివిజన్‌లోని హబీబ్ నగర్ ప్రాంతంలో హైడ్రా అధికారులు ఆక్రమణలపై దాడి చేశారు. నాలా పైన నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు గురువారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ చర్యల్లో భాగంగా.. హబీబ్‌ నగర్‌ ప్రాంతంలో ఎన్ఆర్సి గార్డెన్ ప్రహరీ గోడతో పాటు మరో ప్రహరీ గోడను కూడా హైడ్రా అధికారులు కూల్చేశారు. స్థానికంగా 7 మీటర్ల విస్తీర్ణంలో నాలా ఉందని గుర్తించిన అధికారులు, వాటిపై జరిగిన ఆక్రమణలను తొలగించేందుకు పోలీసుల బందోబస్తుతో ముందస్తు చర్యలు చేపట్టారు.

Read Also:Nitish Kumar Reddy: వారి సూచనలు బాగా పనిచేశాయి.. తెలుగు కుర్రాడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఈ కూల్చి వేతలలో హైడ్రా అధికారులు ఎన్.కే.ఎన్.ఆర్ గార్డెన్ ప్రహరీ గోడను కూడా కూల్చివేశారు. ఈ నిర్మాణాలు నాలా పైకి అక్రమంగా విస్తరించారని అధికారులు పేర్కొన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా, అలాగే వరదల సమయంలో నీటి ప్రవాహం నిలుపుకు అడ్డంగా మారే నిర్మాణాలను తొలగించడం అవసరమని వారు తెలిపారు. నగరంలో నాలాలపై ఆక్రమణలు నివారించేందుకు హైడ్రా (HYDRA) అధికారులు ముందుకు సాగుతున్నారు. వరదల నియంత్రణ, సమర్థవంతమైన డ్రెయినేజ్ వ్యవస్థ కోసం ఆక్రమిత నిర్మాణాల తొలగింపు చర్యలు నిరంతరంగా కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also:TDP: ఆళ్లగడ్డలో టీడీపీకి షాక్

Exit mobile version