HYDRA: కూకట్‌పల్లి బాలాజీ నగర్ డివిజన్ హబీబ్ నగర్‌లో హైడ్రా కూల్చివేతలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి బాలాజీ నగర్ డివిజన్‌లోని హబీబ్ నగర్ ప్రాంతంలో హైడ్రా అధికారులు ఆక్రమణలపై దాడి చేశారు. నాలా పైన నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు గురువారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ చర్యల్లో భాగంగా.. హబీబ్ నగర్ ప్రాంతంలో ఎన్ఆర్సి గార్డెన్ ప్రహరీ గోడతో పాటు మరో ప్రహరీ గోడను కూడా హైడ్రా అధికారులు కూల్చేశారు. స్థానికంగా 7 మీటర్ల విస్తీర్ణంలో నాలా ఉందని గుర్తించిన అధికారులు, వాటిపై జరిగిన ఆక్రమణలను తొలగించేందుకు పోలీసుల బందోబస్తుతో ముందస్తు చర్యలు చేపట్టారు.
Read Also:Nitish Kumar Reddy: వారి సూచనలు బాగా పనిచేశాయి.. తెలుగు కుర్రాడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Also Read
ఈ కూల్చి వేతలలో హైడ్రా అధికారులు ఎన్.కే.ఎన్.ఆర్ గార్డెన్ ప్రహరీ గోడను కూడా కూల్చివేశారు. ఈ నిర్మాణాలు నాలా పైకి అక్రమంగా విస్తరించారని అధికారులు పేర్కొన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా, అలాగే వరదల సమయంలో నీటి ప్రవాహం నిలుపుకు అడ్డంగా మారే నిర్మాణాలను తొలగించడం అవసరమని వారు తెలిపారు. నగరంలో నాలాలపై ఆక్రమణలు నివారించేందుకు హైడ్రా (HYDRA) అధికారులు ముందుకు సాగుతున్నారు. వరదల నియంత్రణ, సమర్థవంతమైన డ్రెయినేజ్ వ్యవస్థ కోసం ఆక్రమిత నిర్మాణాల తొలగింపు చర్యలు నిరంతరంగా కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also:TDP: ఆళ్లగడ్డలో టీడీపీకి షాక్
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!