NTV Telugu Site icon

Hydra: తూముకుంట‌ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల కూల్చివేత… ప్రకృతి రిసార్ట్స్‌ నేల మట్టం

Hydra

Hydra

తూముకుంట‌ మున్సిపాలిటీ పరిధిలోని దేవ‌ర‌యాంజ‌ల్ గ్రామంలోని కోమ‌టి కుంట‌లో గురువారం హైడ్రా అక్రమ క‌ట్టడాల‌ను తొల‌గించింది. కోమ‌టికుంట ఎఫ్‌టీఎల్ లో నిర్మాణాల‌పై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. హైడ్రా ఇరిగేష‌న్‌, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారుల‌తో పూర్తి స్థాయి విచార‌ణ చేప‌ట్టింది. కోమ‌టి కుంట చెరువు ప‌రిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్‌, ప్రకృతి క‌న్వెన్షన్ కు ఎలాంటి నిర్మాణ అనుమ‌తులు లేవ‌ని వెల్లడింది.. అలాగే చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోనే ఈ నిర్మాణాలు జ‌రిగిన‌ట్టు విచారణలో తేలడంతో కూల్చివేత‌ల‌కు ఆదేశించింది.

READ MORE: AP MLC Elections 2025: ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 10 మంది అభ్యర్థులు..

హైడ్రా నోటీసులపై ప్రకృతి రిసార్ట్స్‌, ప్రకృతి క‌న్మెన్షన్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరిగేష‌న్‌, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన నివేదిక‌ల ఆధారంగా చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మించిన వాటిని కూల్చివేయాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.. తామే తొల‌గిస్తామ‌ని.. 30 రోజుల స‌మ‌యం కావాల‌ని హైకోర్టును ప్రకృతి రిసార్ట్స్‌ నిర్వాహకులు కోరారు.. 30 రోజులు దాటినా వాటిని తొల‌గించ‌కపోవ‌డంతో..నేరుగా రంగంలోకి దిగి కూల్చివేత‌లు చేపపట్టారు.

READ MORE: Tamil Nadu: బుల్లెట్ బండి నడిపినందుకు.. దళిత విద్యార్థి చేతులు నరికివేత..