మద్యం సేవించేటప్పుడు తినకూడని పదార్థాల గురించి చూద్దాం..
వైన్ తాగేటపుడు లేదా తాగిన తర్వాత బీన్స్ లాంటి కాయధాన్యాలను తినకూడదు. వీటిల్లో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది.
వీటిల్లో ఐరన్, మద్యంలో ఉండే టానిన్ రెండూ రియాక్ట్ అయ్యి జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది.
కొంతమంది వైన్ సేవిస్తూ చాక్లెట్‌ని తింటారు. కారణంగా కడుపులో గ్యాస్ పెరుగుతుంది.
మద్యం సేవిస్తూ అధిక మొత్తంలో ఉప్పు ఉండే ఆహార పదార్థాలు, బాగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు.
ఇది మీ జీర్ణవ్యవస్థకు హానికరం. ఉప్పు ఎక్కువ ఉంటే ఎక్కువగా తాగేస్తారు. అధిక మూత్ర విసర్జనకు కారణమవుతుంది.
మద్యంతో బ్రెడ్, పిజ్జా, బర్గర్ల లాంటివి అస్సలు తినకూడదు.
వీటిల్లో ఈస్ట్ ఉంటుంది కాబట్టి మీ కడుపులో జీర్ణవ్యవస్థకు అదనపు భారం కలిగిస్తుంది.
ఆల్కహాల్ తీసుకునేటపుడు లేదా దాని తర్వాత కూడా కాఫీలాంటి పానీయాలకు దూరంగా ఉండాలి.
కాఫీ, కొన్ని చాక్లెట్లలో ఉండే కెఫీన్, కోకో లాంటి సమ్మేళనాలు గ్యాస్ట్రో సమస్యలను మరింర తీవ్రతరం చేస్తాయి.
మద్యం సేవించిన తర్వాత తర్వాత పాల పదార్థాలు, స్వీట్లు తీసుకోకూడదు.