ICC World Cup: సరికొత్త హంగులతో.. ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లకు సిద్ధమవుతోన్న ఉప్పల్ స్టేడియం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uppal Stadium is Ready for ICC ODI World Cup 2023 with New Look: వన్డే ప్రపంచకప్ 2023 భారత్‌లో జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. భారత్‌లోని మొత్తం 10 మైదానాల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం (రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం) కూడా ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. రెండు వార్మప్ మ్యాచ్‌లతో పాటు మూడు ప్రధాన మ్యాచ్‌లు ఉప్పల్ మైదానంలో జరగబోతున్నాయి. ఈ మ్యాచ్‌ల కోసం ఉప్పల్ స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది.
గతంలో ఉప్పల్ మైదానంలో చాలా సమస్యలు ఉండేవి. ఓ వైపు పైకప్పు ఎగిరిపోయి, కుర్చీలు విరిగిపోయి, తాగునీరు ఇబ్బంది తదితర సమస్యలు ఉండేవి. ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించిన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ).. ఉప్పల్ స్టేడియాన్ని సరికొత్తగా ముస్తాబు చేస్తోంది. ప్రస్తుతం స్టేడియం ఆధునీకీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. దక్షిణం వైపు వర్షాలకు ఎగిరిపోయిన పైకప్పు స్థానంలో కొత్తదాన్ని బిగించారు. తూర్పు పైకప్పు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. కొత్త ఎల్ఈడీ ఫ్లడ్‌లైట్లు కూడా వచ్చేసాయి. 12 వేల కొత్త కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచకప్ తర్వాత మిగతా కుర్చీలతో పాటు పశ్చిమ వైపు పైకప్పు కూడా సరి చేస్తారు.
Also Read
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
- T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
వర్షం పడినా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నీరు నిలవకుండా ఉండటం కోసం.. డ్రైనేజీ వ్యవస్థనూ హెచ్‌సీఏ మెరుగుపరిచింది. కొత్త రంగులతో ఉప్పల్ స్టేడియంను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక అభిమానుల కోసం ఉచితంగా నాణ్యమైన తాగునీటి వసతిని హెచ్‌సీఏ అందించనుంది. మొట్టమొదటి సారి ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు ఉప్పల్ స్టేడియం అందంగా సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో 27 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది. చివరగా ఎల్బీ స్టేడియంలో 1996 ప్రపంచకప్‌లో (వెస్టిండీస్ vs జింబాబ్వే) మ్యాచ్ జరిగింది.
వన్డే ప్రపంచకప్ 2023షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించగానే.. తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు ఎంతగానో నిరాశపడ్డారు. ఇందుకు కారణం ఒక్క భారత్ మ్యాచ్ కూడా ఉప్పల్ స్టేడియంలో లేకపోవడం. ఈసారి ఉప్పల్ స్టేడియంలో అయిదు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఉండగా.. మూడు ప్రధాన మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ నెల 29న పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మొదటి వార్మప్ మ్యాచ్ ఉండగా.. అక్టోబర్ 3న ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య రెండో వార్మప్ మ్యాచ్ ఉంది. అక్టోబర్ 6న నెదర్లాండ్స్-పాకిస్థాన్, అక్టోబర్ 9న నెదర్లాండ్స్-న్యూజిలాండ్, అక్టోబర్ 10న శ్రీలంక-పాకిస్థాన్ జట్లు తలపడతాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..