Saida Begum: విజయవాడ టెర్రర్ లింక్ లో హైదరాబాదీ సైదా బేగం.. విచారణ లో సంచలన విషయాలు వెలుగులోకి

  • విజయవాడ టెర్రర్ లింక్ లో హైదరాబాదీ సైదా బేగం
  • మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా సైదా బేగం బాధ్యత
  • మహిళలను రిక్రూట్ చేసుకునేలా సైదా బేగం కు ఉగ్రవాదుల టార్గెట్
Saida Begum

Saida Begum

విజయవాడ టెర్రర్ లింక్ లో హైదరాబాదీ సైదా బేగం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా సైదా బేగం బాధ్యత తీసుకున్నట్లు గుర్తించారు. మహిళలను రిక్రూట్ చేసుకునేలా సైదా బేగం కు ఉగ్రవాదుల టార్గెట్ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటి వరకు 42 మంది అమ్మాయిలను సైదా రిక్రూట్ చేసినట్టు అధికారులు గుర్తించారు.
అమ్మాయిలకు స్నిప్పర్ రైఫిల్, షూటింగ్ వంటి వాటిలో ట్రైన్ చేయాలని టెర్రరిస్టులు అదేశాలు ఇచ్చినట్లు తేలింది.

Also Read:Vizag Crime: విశాఖలో యువతి దారుణ హత్య.. శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టిన ఘటనలో బిగ్ ట్విస్ట్..

Khawateen పేరుతో స్పెషల్ వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసిన సైదా బేగం.. మరింత ఎక్కువగా యూత్ ను ఇస్లాం వైపు ఆకర్షితులను చేసి నెట్వర్క్ పెంచాలని జిహాదీ గ్రూప్స్ నుండి ఆదేశాలు వచ్చినట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఇందులో ఒసామా బిన్ లాడెన్, జకీర్ నాయక్ వీడియోలు షేర్ చేస్తూ అమ్మాయిలను ఉగ్రవాదం వైపు మల్లించింది సైదా బేగం. ఇన్ స్టాగ్రామ్ లో 40 అకౌంట్ లు తెరిచి జిహాదీ వీడియోలు పోస్ట్ చేస్తూ యూత్ లో ఐడియాలజీ నింపింది.

Also Read:Repo Rate: రెపో రేట్ పై ఆర్‌బీఐ గవర్నర్ కీలక ప్రకటన.. ఈఎంఐ తగ్గుతుందా?

మదర్సాల్లో మతపరమైన శిక్షణ అయ్యాక వెపన్ ట్రైనింగ్ కు సన్నాహాలు చేసినట్లు వెల్లడైంది. వాట్సాప్, insta అకౌంట్ ల్లో కుప్పల కొద్ది pdf ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బ్లాక్ పౌడర్ మేకింగ్, పేలుడు పదార్థాల తయారీ వంటి వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. వీటిని ట్రైనింగ్, రిక్రూట్‌మెంట్‌కు సంబంధించినవిగా గుర్తించారు. ప్రస్తుతం ఉగ్రవాద లింకులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఉగ్రవాద నెట్‌వర్క్‌లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.