హైదరాబాద్ లో ఆదివారం విషాదం చోటు చేసుకుంది.. ఒకేసారి పలు చోట్ల ప్రమాదాలు జరిగాయి.. కేవలం గంటల వ్యవధిలోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.. ఈ రోజు ఉదయం పూట కేవలం మూడు గంటల వ్యవధిలోనే మూడు రోడ్డు ప్రమాదాలు జరగడం కలకలం రేపింది.. ఈ మూడు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. ఉదయం ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎవరికి ప్రమాదం జరగలేదు. కానీ కారు మాత్రం పూర్తిగా దెబ్బతింది.. అయితే కారులో ఉన్న సెఫ్టీ బెలూన్స్ తెరుచుకోవడం వల్లే అందులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ తర్వాత వారు కారు దిగి వెళ్లిపోయారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారు అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు..
ఇకపోతే రంగారెడ్డి జిల్లాలోని ఆరాంఘర్ వద్ద ఓ బైక్ అదుపుతప్పి విద్యుత్ స్థంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అలాగే కుషాయిగూడలోని ఓ కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కూడా ముగ్గురు మరణించారు. అయితే ఈ ప్రమాదాలు వాహనాలు వేగంగా నడపడమే కారణమే పోలీసులు భావిస్తున్నారు.. అయితే స్పాట్ లోనే వారందరు చనిపోయారు…
అంతేకాదు వారంతా కూడా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.. అయితే ఈ మూడు రోడ్డు ప్రమాదాలపై సంబంధిత పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల, అధిక వేగంగా వాహనాలను నడపడం, మద్యం సేవించడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు..ప్రమాదాల నివారణకు పోలీసులు , అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు..