Site icon NTV Telugu

Hyderabad: డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ టెకీ.. ఊడిన ఉద్యోగం.. అయినా మారని వైనం..

Drugs

Drugs

కష్టపడి బీటెక్ పూర్తి చేశాడు. చదివిన చదువుతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాధించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగంతో జీవితాన్ని స్వార్థకతకు నిదర్శనంగా మలుచుకోవాల్సిన పరిస్థితుల్లో తప్పటడుగు వేశాడు. అంచలంచలుగా ఎదగాల్సిన స్థితిలో డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. అలాగే డ్రగ్స్ అమ్మకాల్లో దిగి కటకటాల పాలైన సాఫ్ట్వేర్ ఉద్యోగి కథనం ఇది.

READ MORE: FASTag Annual Pass: రూ.3000 వార్షిక పాస్ ఎక్కడ తీసుకోవాలి.. ఏయే వాహనాలకు వర్తిస్తుంది..?

సాఫ్ట్వేర్ ఉద్యోగంతో వస్తున్న లక్షల జీతాలు సరిపోవంటూ డ్రగ్స్ అమ్మకాలకు దిగడంతో చేస్తున్న ఉద్యోగం ఊడింది. ఒకటికి రెండుసార్లు ఎక్సైజ్ సిబ్బందికి పట్టుబడి ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన వి. వెంకట జగదీశ్వర్ రెడ్డి (25) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజేంద్రనగర్ మండలం మైలార్ దేవులపల్లి ప్రాంతం మైఫిల్ హోటల్ సమీపంలో డ్రగ్స్ ను తీసుకు వెళ్తుండగా డీటీఎఫ్ సీఐ ప్రవీణ్ కుమార్ మంగళవారం తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. నిందితుడి వద్ద 23.3 ఎండీఎంఏ డ్రగ్స్, సెల్ ఫోన్, బైకును స్వాధీనం చేసుకున్నారు. బీటెక్ చదివి బెంగళూరులో కాట్నీ వెల్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడే డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు.

READ MORE: YS Jagan Annaprasana: చిన్నారి ఆద్విక్‌కు అన్నప్రాసన చేసిన వైఎస్ జగన్..

బెంగళూరుకు చెందిన సైఫ్ షరీఫ్ అనే వ్యక్తి వద్ద రూ. 1500 ఒక గ్రాము చొప్పున ఎండీఎంఏ డ్రగ్స్ ను కొనుగోలు చేసి హైదరాబాదులో రూ. ఐదు వేల నుంచి రూ. 8 వేల వరకు గ్రామ చొప్పున అమ్మకాలు జరుపుతున్నాడు. ఈ మధ్యనే ఎండీఎంఏ డ్రగ్స్ అమ్మకాలు జరుపుతూ ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి కండిషన్ బెయిల్ పై బయటకు వచ్చాడు. మళ్లీ డ్రగ్స్ తో మంగళవారం డీటీఎఫ్ శంషాబాద్ టీంకు పట్టుబడ్డాడు. డ్రగ్స్ అమ్మకాలతో మొదటగా ఉప్పల్లో పట్టుబడటంతో చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయింది. కేసు పూర్వపరాలను శంషాబాద్ ఏఎస్ అయినేని శ్రీనివాసరెడ్డి శంషాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో పోలీస్ వివరించారు.

Exit mobile version