ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఇటీవల ప్రచురించిన పరిశోధన ఓ పెద్ద ప్రమాదాన్ని లేవనెత్తింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ, 2025లో ప్రచురితమైన ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని ప్రజలు లైంగిక కార్యకలాపాల సమయంలో తమ బలాన్ని పెంచుకోవడానికి యువత అనేక రకాల మందులను ఉపయోగిస్తున్నారని తేలింది.
కష్టపడి బీటెక్ పూర్తి చేశాడు. చదివిన చదువుతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాధించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగంతో జీవితాన్ని స్వార్థకతకు నిదర్శనంగా మలుచుకోవాల్సిన పరిస్థితుల్లో తప్పటడుగు వేశాడు. అంచలంచలుగా ఎదగాల్సిన స్థితిలో డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. అలాగే డ్రగ్స్ అమ్మకాల్లో దిగి కటకటాల పాలైన సాఫ్ట్వేర్ ఉద్యోగి కథనం ఇది.
తిరుపతిలో మత్తు ఇంజక్షన్లు కలకలం సృష్టిస్తున్నాయి. స్థానిక ఇంద్ర ప్రియదర్శిని కూరగాయలు మార్కెట్లో మత్తు ఎక్కించే ఇంజక్షన్లు వీడియో వైరల్ అవుతోంది. ఇంజక్షన్ లను తీసుకునే సమయంలో యువకులు వీడియో తీశారు. కూరగాయల మార్కెట్ లో తరచూ మత్తులో ఉంటూ యువకులు హల్ చల్ సృష్టిస్తున్నారు. తిరుపతి నగరంలో విచ్చలవిడిగా మత్తు పదార్థాల వినియోగం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. యువత స్వయంగా మత్తు ఇంజక్షన్లు వేసుకుంటున్నారని వెల్లడిస్తున్నారు.