కష్టపడి బీటెక్ పూర్తి చేశాడు. చదివిన చదువుతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాధించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగంతో జీవితాన్ని స్వార్థకతకు నిదర్శనంగా మలుచుకోవాల్సిన పరిస్థితుల్లో తప్పటడుగు వేశాడు. అంచలంచలుగా ఎదగాల్సిన స్థితిలో డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. అలాగే డ్రగ్స్ అమ్మకాల్లో దిగి కటకటాల పాలైన సాఫ్ట్వేర్ ఉద్యోగి కథనం ఇది.
నగరంలోని ఎల్బీనగర్ పోలీసులకు డ్రగ్ మాఫియాపై భారీ విజయం లభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.1.2 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని హాష్ ఆయిల్‌గా మార్చి, చిన్న చిన్న బాటిళ్లలో గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్న స్మగ్లర్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. గంజాయి స్మగ్లర్లు కొత్త తంత్రాన్ని ఎంచుకున్నారు. భారీగా ప్యాకెట్లు తరలించడం కష్టంగా మారడంతో హాష్ ఆయిల్ రూపంలో గంజాయిని మారుస్తున్నారు. హాష్ ఆయిల్‌కు ప్రత్యేక…