Site icon NTV Telugu

Real Estate Scam: అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో కుచ్చుటోపీ.. మరో రియల్ ఎస్టేట్ ఘరానా మోసం వెలుగులోకి!

Tripura

Tripura

Real Estate Scam: పొట్ట చేత పట్టుకొని పొరుగు రాష్ట్రానికి కూలి పనులకు వెళ్లిన అతను కోట్లకు పడగలెత్తాడు. ఎన్నికల్లో పోటీ చేసే స్థాయికి ఎదిగాడు. ఓ మాఫియా డాన్ కు బినామిగా వ్యవహరించాడు అనే ఆరోపణలు సైతం ఎదుర్కొన్నాడు. అయితే అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో జనానికి కుచ్చు టోపీ పెట్టి ఊచలు లెక్కిస్తున్నాడు. ఇంతకీ ఎవరతను? కోట్ల రూపాయల ఆస్తులకు ఎలా పడగలెత్తాడు..? ఇప్పుడు చేతులెత్తేసే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? తాకట్టులోన బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది.

Puri jagannath temple: పూరి జగన్నాథుడి ఆలయంలో “బనకలగి” పూజ.. ఆ 4 గంటలు ఏం జరుగుతుంది.?

కొమ్మూరి కోల్ హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో వందల కోట్ల రూపాయలకు కుచ్చు టోపీ పెట్టింది త్రిపురా కన్స్ట్రక్షన్స్. దీంతో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పసుపులేటి సుధాకర్ అతని భార్యను అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు సుధాకర్ కూతురు అల్లుడు పరారీలో ఉన్నారు. ఇంతకీ ఎవరి పసుపులేటి సుధాకర్? అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అని ఆరా తీస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నెల్లూరు జిల్లా కావలకు చెందిన పసుపులేటి సుధాకర్ ఐదవ తరగతి వరకే చదువుకున్నాడు. భవన నిర్మాణ కార్మికుడిగా సెంట్రింగ్ మేస్త్రిగా పని చేశాడు. నెల్లూరులో బతకలేక తెలంగాణకు మకాం మార్చాడు. ఇళ్ల నిర్మాణంలో కిటుకులు నేర్చుకున్నాడు. అంచలంచలుగా ఎదిగాడు. త్రిపురా కన్స్ట్రక్షన్స్ కంపెనీ పెట్టాడు. కోట్ల రూపాయలు కళ్ళరా చూశడు. కావలిలో 100 ఎకరాలకు పైగా భూములు కొనుగోలు చేశాడు. డబ్బుకు కొదువ లేదు. కాబట్టి పొలిటీషియన్ కావాలనుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికల్లో పోటీకి చకచక పావులు కదిపాడు.

Rajahmundry Adulterated Milk: కల్తీ పాల ఘటన.. రోజురోజుకి పెరుగుతున్న మరణాలు!

2019లో జనసేనలో చేరిన సుధాకర్ కావలి నియోజక వర్గం నుంచి పోటీ చేశాడు. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గెలవలేకపోయాడు. తిరిగి హైదరాబాద్ కు చేరుకొని కొద్ది రోజులు బీజెపీలో చేరాడు. తర్వాత కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తానంటూ టీడీపీ, వైసీపీ ముఖ్యనేతలతో లాబీయింగ్ చేశాడు. కానీ అవేవి పని చేయలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే డిపాజిట్ కూడా రాలేదు. 2019, 2024 ఎన్నికల్లో దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు సుధాకర్. అప్పటివరకు తాను సంపాదించిన దానితో పాటు ప్లాట్ల పేరుతో జనం నుంచి వసూలు చేసిన డబ్బును కూడా ఎన్నికలలో ఖర్చు పెట్టేసాడు. దీనితో ఇంకేముంది జనం ముందు దోషిగా నిలబడ్డాడు. పసుపులేటి సుధాకర్ పై గతంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీంకి బినామిగా పని చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే కొందరు ప్రముఖ రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలను అడ్డం పెట్టుకొని త్రిపురా కన్స్ట్రక్షన్స్ కంపెనీని ఏర్పాటు చేశాడు. అయితే ప్లాట్ల విక్రయాల్లో జనం నెత్తిన కుచ్చుటేపి పెట్టేసాడు. దీంతో లబోదిబో అంటున్నారు బాధితులు.

Exit mobile version