Site icon NTV Telugu

Fire Accident : పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి.. మృతుల్లో ఓ చిన్నారి..?

Fire

Fire

Fire Accident : హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు భవనాన్ని చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న కొందరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు తగిలినట్లు తెలుస్తోంది. వారికి అక్కడే ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.

Chennai: సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్ల కలకలం.. స్నేహితుడైన ఓ ఖైదీ కోసం గంజాయి ఇవ్వడానికి వెళ్ళి..

అయితే.. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని సమాచారం.. అంతేకాకుండా… మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో తీరని శోకం నెలకొంది. మృతి చెందిన మిగిలిన వారి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవనంలో సరైన భద్రతా చర్యలు లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు ఇప్పటివరకు 13 మందిని సురక్షితంగా వెలికి తీసి ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, వెంటనే ఘటనా స్థలానికి 10 అంబులెన్స్‌లను రప్పించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో దాదాపు 30 మంది వరకు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో మొత్తం నాలుగు కుటుంబాలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

USA: కాలిఫోర్నియాలోని ఆసుపత్రి సమీపంలో బాంబు పేలుడు.. ఒకరు మృతి

Exit mobile version