HYD ROHINGYA : హైదరాబాద్‌లో ఉన్న రోహింగ్యాలు ఎంత మంది? ఈ ప్రశ్నకు ఎవరి దగ్గరా సరైన ఆన్సర్ లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రోహింగ్యాలు స్థానికంగా ఉన్న గుర్తింపు కార్డులు పొంది మనలో కలిసిపోయారు. పైగా తామే లోకల్ అంటూ కాలర్ ఎగిరేసి మరీ చెప్పుకుంటున్నారు. ఇంకా కొంత మంది రోహింగ్యాలైతే క్రైమ్స్ చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. వీరి వల్ల జాతీయ భద్రతే ప్రమాదంలో పడింది. యస్.. మీరు విన్నది కరెక్టే…!! బంగ్లాదేశ్, మయన్మార్…
Shocking Incident : హైదరాబాద్ పాతబస్తీలోని ఐ.ఎస్. సదన్ ప్రాంతంలో గురువారం ఉదయం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో నుంచి వస్తున్న తీవ్ర దుర్వాసన చూసి స్థానికులు అనుమానం పోలీసులకు సమాచారం అందించారు. మలక్‌పేటలో ఈ సంఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, సంబంధిత ఇంటిని పరిశీలించారు. ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో అధికారులు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఈ క్రమంలో ఇంటి అంతా రక్తపుదారలు కనిపించడంతో…
Fire Accident : హైదరాబాద్ పాతబస్తీలోని మొఘల్‌పురాలో గురువారం ఉదయం తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో ఏర్పాటు చేసిన కార్టూన్ గోదాంలో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ప్రమాద సమయంలో భవనంలో ఉన్న తొమ్మిది మందిని ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి శ్రమించారు. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న గోదాంలో…
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం భారీ నష్టా్న్ని మిగిల్చింది. తాజాగా గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద కారణాలను అధికారులు గుర్తించారు. అగ్నిప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని తేల్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలిపోవడంతో ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. అధికారుల వివరాల ప్రకారం.. కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను నడుపుతుండటంతో ఘటన జరిగింది.
Fire Accident : హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు భవనాన్ని చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న కొందరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు తగిలినట్లు తెలుస్తోంది.…
Hyderabad Crime Update: బాలాపూర్ గ్యాంగ్ స్టర్ మెంటల్ రియాజ్ హత్య కేసులు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది. ఆరు హత్య కేసులో మృతుడు రియాజ్ కు ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు.
Hyderabad Crime: పాతబస్తీ బాలాపూర్‌లో గ్యాంగ్‌స్టర్ రియాజ్ పై కాల్పులు కలకలం రేపాయి. బాలాపూర్‌లోని ఏఆర్‌సీఐ రోడ్డులో రియాజ్‌పై గుర్తు తెలియని దుండగుల మూడు రౌండ్ల కాల్పులు చేసి హత్య చేశారు.