Hyderabad: అండాల దందా.. ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ల రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: ఫెర్టిలిటీ సెంటర్ల అక్రమాలకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళల నుంచి అక్రమంగా అండాల సేకరణలో ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్స్ డాక్టర్లు కీలక పాత్ర పోషించారని పోలీసులు గుర్తించారు. ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల గుట్టురట్టు చేసిన పోలీసులు, ఒక చోట మాత్రమే అనుమతి తీసుకుని 43 సెంటర్లలో ఓయాసిస్, సద్గురు సెంటర్లను నడుపుతున్నట్లు తేల్చారు. రిమాండ్ రిపోర్టులో ఇంకా అనేక విస్తుపోయే విషయాలు నమోదయ్యాయి. మహిళలే లక్ష్యంగా సాగుతున్న అండాల దందాలో బ్రోకర్ల ముఠా ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను నగరానికి తీసుకొచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు డబ్బు ఆశ చూపినట్లు పోలీసులు ఆరోపించారు. ఒక్కో అండం దానం సైకిల్‌కు రూ. 50 వేల వరకు ఆఫర్ ఇచ్చారని తెలిపారు. అలా హైదరాబాద్‌కు తీసుకొచ్చిన మహిళలను బేగంపేటలోని అమీ నీతా గర్ల్స్ హాస్టల్లో బస చేయించి, అక్కడి నుంచే ఫెర్టిలిటీ సెంటర్లకు తరలించారు.
అండాల ఉత్పత్తి కోసం మహిళలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండానే హాస్టల్లో ఇంజెక్షన్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. హాస్టల్లో హ్యూమాగ్ హెచ్‌పీ 150 ఐయూ (Humog HP 150 IU) ఇంజెక్షన్లు, వాడిన మెడిసిన్ వైల్స్‌ను పోలీసులు గుర్తించారు. అలాగే బయోమెడికల్ వేస్ట్ నిబంధనలు పాటించకుండా వైద్య వ్యర్థాలను తొలగించినట్లు తేలింది. బంజారాహిల్స్, దిల్సుఖ్నగర్ కేంద్రాల్లో అండాల సేకరణ ప్రక్రియ జరగ్గా, సేకరించిన అండాలను ఐవీఎఫ్ (IVF) చికిత్స కోసం వినియోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Also Read
- India Slams Pakistan Army: సహజ వనరులను పాక్ సైన్యం దోచుకుంటోంది.. పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!
- Drug Racket: DRI మెరుపు దాడులు.. రూ.700 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..
- Monalisa: కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా ఇప్పుడు ఎక్కడుంది? పెళ్లి తర్వాత జీవితం ఎలా మారింది?
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడి.. తుది దశ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..!
ఒక్కో డోనర్‌కు రూ. 65 వేల వరకు బ్రోకర్లకు చెల్లించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే ఏడు కంటే తక్కువ అండాలు వస్తే బ్రోకర్‌కు చెల్లింపుల్లో కోత విధించేలా, అండాల నాణ్యత ఆధారంగా కూడా చెల్లింపులు తగ్గించేలా నిబంధనలు పెట్టుకున్నారు. ఆరో రోజు కంటే ముందే ప్రక్రియ ఆగితే బ్రోకర్‌కు అసలు చెల్లింపులు (నో పేమెంట్) చేయని విధంగా ఒప్పందాలు ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 66 డోనర్ కేసులు జరిగినట్లు రికార్డులు చెబుతుండగా, అధికారులకు మాత్రం కేవలం 47 మంది డోనర్ల వివరాలనే సమర్పించారు. దీంతో మిగిలిన 19 మంది డోనర్ల రికార్డులు ఏమయ్యాయనే ప్రశ్నలు తలెత్తాయి. ఇలా సేకరించిన అండాలను గచ్చిబౌలి, ఉప్పల్, టోలిచౌకి, మలక్‌పేట కేంద్రాలకు సరఫరా చేశారు. కొన్ని ఫెర్టిలిటీ బ్రాంచ్‌ల అనుమతులపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో డోనర్ బుక్, విజిటర్ బుక్, శాంపిల్స్ ట్యాంక్ బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఓయాసిస్ ఎండీ డాక్టర్ దుర్గారావు పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. బ్రోకర్లు అమిత్ శర్మ, నిఖత్ పర్వీన్ సహా పలువురు నిందితులు పరారీలో ఉన్నట్లు నమోదు చేశారు. మలక్‌పేట బ్రాంచ్ ఇన్చార్జ్ ఆనంద్‌రాజ్, అడ్మిన్ సుభానీ షేక్‌లను అరెస్టు చేసిన పోలీసులు, ఇద్దరు నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. బీఎన్ఎస్ (BNS)తో పాటు ఏఆర్టీ (ART) చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, మహిళల ఆరోగ్య భద్రత, అక్రమ అండాల సేకరణ, బ్రోకర్ల నెట్‌వర్క్‌పై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: అండాల దందా.. ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ల రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు..
-
India Slams Pakistan Army: సహజ వనరులను పాక్ సైన్యం దోచుకుంటోంది.. పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!
-
GTA 5 to GTA 6: GTA 5 నుంచి GTA 6 వరకు.. 13 ఏళ్లలో భారత్‌లో వచ్చిన మార్పులపై పీఎం మోడీ పోస్ట్!
-
Swasika: ఆమె నటిస్తే మూవీ హిట్టే.. ‘ఏవోటీ’తో హ్యాట్రిక్ సాధిస్తుందా?
-
Drug Racket: DRI మెరుపు దాడులు.. రూ.700 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!