Hyderabad: భాగ్యనగరంలో ఇక కొత్త లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాదు సిటీ పోలీసు కమిషనరేట్ పునః వ్యవస్థీకరణలో భాగంగా తీసుకున్న కొత్త నిర్ణయాలు, వాటి వివరాలను సీపీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ ను 35 సంవత్సరాల తర్వాత జి.ఓ.ఎం.ఎస్. నెం. 32, (హోం లీగల్ డిపార్ట్మెంట్) ద్వారా తేది 30.04.2023 నాడు పోలీసు పునః వ్యవస్థీకరణ చేయడానికి ఉత్తర్వులు చేసారు. ఈ జి.ఓ. ప్రకారం రెండు అదనపు లా అండ్ ఆర్డర్ జోన్లు (సౌత్ ఈస్ట్ + సౌత్ వెస్ట్), 11 కొత్త లా అండ్ ఆర్డర్ డివిజన్లు, ఒకటి అదనపు ట్రాఫిక్ జోన్ (ట్రాఫిక్ 3), మరో 11 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు (మొత్తం 71), 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు (మొత్తం 31) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే నగరంలో ఉన్న 7 జోన్లకు 7 మహిళా పోలీస్ స్టేషన్లతో మహిళా భద్రతా విభాగం, ప్రత్యేక సైబర్ క్రైమ్ యూనిట్, ఐటీ వింగ్, నార్కోటిక్స్ వింగ్ ఏర్పాటు చేసారు. ఈ మార్పుల కోసం అదనంగా 1200 మంది సిబ్బందిని మంజూరు కూడా చేసారు.
గత 2 సంవత్సరాలుగా, పోలీసు స్టేషన్ హద్దులపై అలాగే కొత్త పోలీస్ స్టేషన్లకు వెళ్లడంలో ఎదురు అవుతున్న సమస్యలపై ప్రజల నుండి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ట్రాఫిక్ పోలీసులకు, లా అండ్ ఆర్డర్ పోలీసులకు కొన్ని ప్రాంతాలలో అధికార పరిధిపై గందరగోళం ఉండటం, సైబర్ క్రైమ్ వింగ్‌ను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని హైదరాబాదు సిటీ అధికారులు అందరితో చర్చించి, ప్రభుత్వానికి తెలిపారు. ప్రభుత్వం పై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా మొత్తం హైదారాబాదు సిటీ పోలీసుకు మంజూరైన 17,020 మంది సిబ్బందిని అంతర్గత సర్దుబాటు, పునః కేటాయింపులు మార్పులతో ప్రతి పాదనలు ప్రభుత్వానికి పంపారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిత పునః సర్దుబాటులను జి.ఓ. నెం. 57 (హోం లీగల్ డిపార్ట్మెంట్) ద్వారా ఆమోదించింది. ఈ మార్పుల వలన రాబోయే పదేళ్ల వరకు హైదరాబాద్ నగర పోలీసులు బాగా పనిచేయటానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు.
Also Read
- Motkupalli Narasimhulu: ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకుంటూ మోత్కుపల్లి భావోద్వేగం.. “మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేం”
- భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
- Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
- ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
Read Also: TGSRTC Strike: భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ సమ్మెపై పునరాలోచించాలి.. మంత్రి విజ్ఞప్తి
ఇక ప్రవేశపెట్టిన ముఖ్యమైన మార్పుల విషయానికి వస్తే..
కొత్త లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు:
హైదరాబాద్ నగర పోలీసు పరిధిలో 72వ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌గా టోలిచౌకి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసారు. ఇంతకు ముందు ఉన్న ఫిల్మ్‌నగర్ పిఎస్, మెహదీపట్నం పిఎస్ (పూర్వం హుమాయున్ నగర్ పిఎస్), గోల్కొండ పిఎస్ పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలను ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకువచ్చారు.
డివిజన్లు, పోలీస్ స్టేషన్ల పేరు మార్పు:
స్థానిక ప్రజలు తొందరగా గుర్తు పట్టడానికి వారికి అనువుగా ఒకటి లా అండ్ ఆర్డర్ డివిజన్ పేరు, మూడు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లకు స్థానికంగా ప్రసిధ్ది చెందిన అలాగే స్థానిక సూచనలను ప్రతిబింబించేలా పేర్లు మార్చారు. గోల్కొండ డివిజన్‌ను ఇప్పుడు టోలిచౌకి డివిజన్ గాను, సెక్రటేరియట్ పిఎస్‌ను లేక్ పిఎస్‌గా ను, హుమాయున్ నగర్ పిఎస్‌ను మెహదీపట్నం పిఎస్ గాను, షాహినాయత్ గంజ్ పిఎస్‌ను గోషామహల్ పిఎస్‌గా పేరు మార్చారు.
Read Also: CM Revanth Reddy: తెలంగాణ నిర్ణయాన్ని దేశం అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉంది..!
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ:
లా అండ్ ఆర్డర్ డివిజన్ల ప్రకారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల హద్దులు ఉండాలని (ముందు నుంచి ఉన్న పద్ధతి ప్రకారం) ప్రస్తుతము ఉన్న మారేడ్‌పల్లి, బోయిన్పల్లి, నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను తీసేశారు. ఆగాగే ప్రస్తుతం ఉన్న లా ఆండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ల పరిధి ప్రకారము వాటికి సంబంధించిన ఏరియాల్లో పనిచేయడానికి ట్రాఫిక్ నాంపల్లి పీఎస్, ట్రాఫిక్ అంబర్పేట్ పీఎస్, ట్రాఫిక్ లంగర్ హౌస్ పీఎస్, ట్రాఫిక్ బహదూర్‌పుర పీఎస్, ట్రాఫిక్ నల్లకుంట పీఎస్‌ల పేర్లు మార్చి ట్రాఫిక్ గాంధీ నగర్ పీఎస్, ట్రాఫిక్ ఉస్మానియా యూనివర్సిటీ పీఎస్, ట్రాఫిక్ కుల్సుంపుర పీఎస్, ట్రాఫిక్ ఛత్రినాకా పీఎస్, ట్రాఫిక్ సైదాబాద్ పీఎస్ లుగా పేర్లు మార్చబడ్డాయి.
మహిళా భద్రతా వింగ్ (WSW)ను బలోపేతం చేయడానికి:
యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ఏర్పాటు చేసారు. ఇందుకోసం ఒక ఇన్స్పెక్టర్, 8 సిబ్బంది ఏర్పాటు చేయగా.. జువెనైల్ బ్యూరో యూనిట్ కు – ఒక ఇన్స్పెక్టర్ తో 7 మంది సిబ్బంది ఉంటారు అని తెలిపారు. అలాగే ప్రతి లా అండ్ ఆర్డర్ జోన్లో ఒక సైబర్ క్రైమ్ సెల్‌లను ఏర్పాటు చేస్తూ అందులో ప్రతి సైబర్ క్రైమ్ సెల్ కు ఒక సబ్-ఇన్స్పెక్టర్, 5 పోలీస్ కానిస్టేబుళ్లతో సిబ్బంది ఉంటారు.
ప్రస్తుత, భవిష్యత్ పోలీసింగ్ అవసరాలకు తగిన విధంగా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాలకు మంజూరైన సిబ్బంది సంఖ్యతో బలోపేతం చేశారు. పునర్వ్యవస్థీకరణలో జరిగిన మార్పులు అధికార పరిధి పటాలు, సంప్రదింపు, పోలీసు స్టేషన్ వివరాలు, పోలీస్ స్టేషన్ స్థానాలు త్వరలో హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచబడతాయని తెలిపారు.
తాజావార్తలు
-
Motkupalli Narasimhulu: ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకుంటూ మోత్కుపల్లి భావోద్వేగం.. “మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేం”
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Vaibhav Suryavanshi: అన్బిలీవబుల్ ప్లేయర్.. వండర్ కిడ్.. పవర్ బ్యాటింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్!
-
Ajit Agarkar: “వైభవ్ ఇంకా చిన్నోడే”.. టీమిండియాలోకి బుడ్డోడి ఎంట్రీపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు..
-
Drishyam 3 : మోహన్ లాల్ ఖాతాలో మరో రికార్డ్.. జస్ట్ 7 రోజుల్లో సెన్సేషన్
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..