Hyderabad Metro: మెట్రో రైల్ లో సాంకేతిక లోపం.. తెరుచుకోని మెట్రో డోర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: హైదరాబాద్ లో నిన్ని సాయంత్రం మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. ఎంజీబీఎస్ లో మెట్రోలు నిలిచి పోవడంతో అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణిలు ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఒక వైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ దీంతో మెట్రోలో ప్రయాణించాలి అనుకున్న వారికి గట్టి షాక్ తగిలింది. నిన్న సాయంత్రం సాంకేతిక లోపంతో ఎక్కడి కక్కడే మెట్రో రైల్లు నిలిచిపోయాయి. మెట్రో రైల్లో వున్న ప్రయాణికులు భాయాందోళనకు గురయ్యారు. సుమారు 10 నిమిషాల పాటు నరకయాతన అనుభవించారు. మెట్రోలో సాంకేతిక లోపం కారణంగా మెట్రో డోర్లు తెరుచుకోలేదు దీంతో ప్రయాణికులు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరోవైపు రైళ్లు ఆగడంతో స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎల్బీనగర్ మెట్రోలో ఎగ్జిట్ మిషన్లు కూడా పనిచేయడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లో మెట్రో రైల్ నిలిచిపోవడంతో.. మెట్రో డోర్లు తెరుచుకోలేదని, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రయాణికులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.
Read also: Astrology: జూన్ 06, గురువారం దినఫలాలు
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఈ ప్రభావం ఇతర మెట్రో సర్వీసులపై పడింది. మియాపూర్ టు ఎల్బీనగర్ రూట్ లో మెట్రో సర్వీసులు స్లో గా నడిచాయి. అయితే ఈ సమస్యను వెంటనే పరిష్కరించినట్లు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. చిన్నపాటి పొరపాటు వల్లే రైళ్లు నిలిచిపోయాయని వెల్లడించారు. 7 నిమిషాల్లో సమస్య పరిష్కారమైంది. అనంతరం దాదాపు 10 నిమిషాల తర్వాత తిరిగి మెట్రో ప్రారంభమైంది. ఈ మేరకు ఎక్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. మేము చిన్న అంతరాయాన్ని త్వరగా పరిష్కరించాము. ఈ సాయంత్రం హైదరాబాద్ మెట్రో రైలు సేవలకు కొద్దిగా అంతరాయం కలిగింది. MGBS వద్ద ట్రాన్స్ కో ఫీడర్ ట్రిప్ అవ్వడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. మా బృందం ఈ సమస్యను 7 నిమిషాల్లో పరిష్కరించాము. మేము దానిని మియాపూర్‌లోని మరొక ఫీడర్‌కు కనెక్ట్ చేసామని తెలిపారు. మెట్రో రైలు సర్వీసులు యథావిధిగా నడుస్తాయరి పేర్కొన్నారు.
Uttarakhand: హిమాలయాల్లో విషాదం.. ట్రెక్కింగ్ చేస్తూ 9 మంది మృతి
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!