Hyderabad IT Raids: హైదరాబాద్‌లో రెండవ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలోని పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తాహౌస్, మేహిఫిల్, షాగ్‌హౌస్ హోటల్స్, యజమానుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఈ హోటల్స్ ఏటా వందల కోట్లు వ్యాపారం చేస్తున్నాయి. ఐటీ రిటర్న్స్ లలో అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. నిన్న ఉదయం 6 గంటలకు ప్రధాన కార్యాలయాలు, హోటల్స్, రెస్టారెంట్స్‌లలో ఐటీ తనిఖీలు నిర్వహించారు.. రాజేంద్రనగర్ లోని పిస్తాహౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ అబ్దుల్ మోషీ ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మహమ్మద్ మాజీద్‌కి సంబంధించిన వర్కర్స్ ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. వర్కర్ల దగ్గర నుంచి కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. రికార్డుల్లో చూపిన ఆదాయానికి నిజమైన ఆదాయం మధ్య వ్యత్యాసం గుర్తించారు.. ట్యాక్స్ చెల్లింపులో తేడాలను గుర్తించారు. షాగోస్ హోటల్స్ లో నిన్న రాత్రి 10 గంటల వరకు కొనసాగిన ఐటీ సోదాలు తాజాగా ముగిశాయి.