Illegal Liquor: గ్రేటర్ హైదరాబాద్‌లో మరోసారి పెద్దఎత్తున నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టుబడింది. రాబోయే దసరా, దీపావళి ఫెస్టివల్ విందు వినోదాల కోసం ఓ ముఠా నగరానికి సరఫరా చేస్తున్న నాన్ పెయిడ్ మద్యం మాఫియా గుట్టురట్టయింది. నగర శివారు ప్రాంతంలో స్టేట్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల వాహనాల తనిఖీల్లో బయట పడింది. 7 లక్షల రూపాయలు విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సీజ్ చేశారు పోలీసులు.
Chitti Scam: కిలాడీ జంట.. చిట్టీల పేరుతో రూ. 30 కోట్లు పంగనామం!
పుష్ప సినిమా రేంజ్‌లో తలదన్నే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు. ఓ ముఠా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ హైదరాబాద్‌కు అక్రమంగా తరలించింది. పోలీసుల కళ్లు కప్పి ఎంచక్కా రాష్ట్రాలు దాటించి బిజినెస్ చేస్తోంది. నగరానికి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తరలిస్తున్న మాఫియా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రాబోయే దసరా, దీపావళి ఫెస్టివల్ సరదాల కోసం ఓ మాఫియా ముఠా.. నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యాన్ని సరఫరా చేస్తోందని తెలంగాణ స్టేట్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగారెడ్డి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం పక్కా ప్లాన్ ప్రకారం వాహనాలు తనిఖీ చేసింది. గ్రేటర్‌లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికట్టాలని ఆబ్కారీ శాఖ జారీచేసిన ఆదేశాల మేరకు నగర శివారు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.
Tirupati Murders Mystery: మిస్టరీగా మారిన ఆ నాలుగు మృతదేహాలు..!
గోవా, హర్యానా, మేఘాలయ ప్రాంతాల నుంచి పహాడీషరీఫ్ క్రాస్ రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న నాన్ పెయిడ్ డ్యూటీ లిక్కర్ వాహనాన్ని పట్టుకున్నారు పోలీసులు. వాహనం నుంచి దాదాపు రూ. 7 లక్షల విలువ చేసే 258 మద్యం బాటిళ్లు సీజ్ చేశారు. అక్రమంగా ఇతర రాష్ర్టాల నుంచి నగరానికి మద్యం రవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు ఎక్సైజ్ పోలీసులు. వారి వద్ద నుంచి ఎన్‌డీపీ లిక్కర్‌తో పాటు 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. రాబోయేది పండుగల సీజన్ కావడంతో.. నగరంలోకి రవాణా అవుతున్న నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ పై ఉక్కు పాదం మోపారు తెలంగాణ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు మరింత ముమ్మరం చేశారు.