Biggest Cyber Robbery: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ సైబర్ దోపిడీ వెలుగు చూసింది. రాయదుర్గంలోని ఒక ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) సిస్టమ్లని లక్ష్యంగా చేసుకున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లు, అత్యంత చాకచక్యంగా కంపెనీ డిజిటల్ నెట్‌వర్క్‌లోకి చొరబడ్డారు. ఉదయం 10:31 గంటల నుంచి 11:58 గంటల మధ్య కేవలం 87 నిమిషాల వ్యవధిలోనే రూ. 3.34 కోట్ల నిధులను అక్రమంగా లూటీ చేశారు.
ఈ సైబర్ దాడిలో కేటుగాళ్లు సదరు సంస్థకు చెందిన బేగంపేట బ్రాంచ్ బ్యాంక్ ఖాతాను లక్ష్యంగా చేసుకున్నారు. అత్యాధునిక హ్యాకింగ్ మెళకువలను ఉపయోగించి, సంస్థ అంతర్గత సిస్టమ్‌లను హ్యాక్ చేసిన నేరగాళ్లు, కంపెనీ అనుమతి లేకుండానే నిధులను విదేశీ , స్వదేశీ నెట్‌వర్క్‌ల ద్వారా మళ్లించారు. కేవలం గంటన్నర సమయంలోనే ఏకంగా 183 విడతల్లో అత్యంత వేగంగా ఈ లావాదేవీలు పూర్తి చేసి, దేశవ్యాప్తంగా ఉన్న 52 వేర్వేరు ఖాతాల్లోకి మొత్తం రూ. 3.34 కోట్లను బదిలీ చేశారు.
Also Read
- Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
- Smuggling Racket: విజయవాడ కేంద్రంగా బంగారం స్మగ్లింగ్.. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
- Hyderabad Fake Snacks Raid: పిల్లలు తినే స్నాక్సేనా ఇవి.? కాటేదాన్‌లో 55 టన్నులు సీజ్.!
- Fake Number Plates: నకిలీ నంబర్ ప్లేట్లకు చెక్.. 100 వాహనాలు సీజ్.!
సిస్టమ్‌లో అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ భారీ నిధుల మళ్లింపును గమనించిన కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన అందించిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో ఈ నిధులన్నీ బెంగళూరు, దిల్లీ, ముంబయి, ఉత్తరప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని బ్యాంకు ఖాతాలకు చేరినట్లు పోలీసులు గుర్తించారు. నిధులు మళ్లించిన ఈ 52 ఖాతాలన్నీ సైబర్ నేరగాళ్లు కమీషన్ల కోసం ఉపయోగించే ‘మ్యూల్ ఖాతాలు’ అయి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో డబ్బు డిపాజిట్ అయిన వెంటనే ఇతర విదేశీ లేదా క్రిప్టో ఖాతాల్లోకి మార్చకుండా నిరోధించేందుకు, ఐపీ చిరునామాలు , బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్రాక్‌ల ఆధారంగా TGCSB పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తును వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
-
Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
-
Ambati Rambabu: ప్రజల్లో వైసీపీపై అనుకూలత పెరిగింది.. అందుకే టీడీపీ నామినేషన్లు అడ్డుకుంటుంది
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!