Hyderabad Crime: ఓ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి యత్నించిన ఘటన హైదరాబాద్‌లోని బోరబండలో చోటుచేసుకుంది. పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బోరబండ సీఐ శేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 17 ఏళ్ల వయస్సున్న బాలిక తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి బుక్ చేసుకున్న ఆటోలో మాదాపూర్ నుంచి బోరబండలోని ఇందిరానగర్‌కి వెళ్తోంది. బోరబండ అన్నానగర్ వద్ద నలుగురు వ్యక్తులు ఆటోను అడ్డగించారు. ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు..? ఎక్కడికి వెళ్తున్నారు.. అని యువతిని ప్రశ్నించారుఇద్దరు బలవంతంగా వారి ఆటోలోకి ప్రవేశించారు. ఒక యువకుడు అమ్మాయి పక్కన కూర్చున్నాడు. యువకుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ వేధించాడు.
Read Also: Delhi: 36 ఏళ్ల నిషేధం తర్వాత ‘ది సైటానిక్ వెర్సెస్’ పుస్తకాలు విక్రయాలు
అడ్డుకోబోయిన బాలిక ప్రియుడిని ఆ యువకులు బెదిరించారు. మరో ఇద్దరు యువకులు బైక్‌పై ఆటోను ఫాలో అయ్యారు. ఆటో డ్రైవర్ బలవంతంగా అందరినీ బయటకు దింపి వెళ్ళిపోయాడు.
బాలిక తన ఇంటి వైపు వెళ్తుండగా.. ఆమె వెంటే అనుసరించి ఆ నలుగురు యువకులు వెళ్లారు. ప్రియుడిని డబ్బులు ఇవ్వాలని ఇద్దరు యువకులు డిమాండ్ చేశారు. బాలిక ఇంటికి చేరుకోగానే.. బాలిక పేరెంట్స్‌ను కూడా కత్తితో బెదిరించారు. బలవంతంగా ఇంట్లోకి దూరి బాలికపై అఘాయిత్యం చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో అది గమనించిన పొరుగింటి వ్యక్తి డయల్ 100కి కాల్‌చేశాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగానే ఆ నలుగురు యువకుు తప్పించుకునే ప్రయత్నం చేశారు.
Read Also: Maharashtra: కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఫైలులో నుంచి బయటకు వచ్చిన విషసర్పం
రాత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం.. పారిపోయిన మరో ఇద్దరిని ఉదయం అదుపులోకి తీసుకున్నామని బోరబండ సీఐ శేఖర్ వెల్లడించారు. యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. బాలికను భరోసా కేంద్రానికి పంపి స్టేట్మెంట్ రికార్డ్ చేశామన్నారు. యువకుల నుంచి 3 బైకులు, కత్తి స్వాధీనం చేసుకున్నామని.. వారిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.