HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉద్యోగుల నిరసన.. నేటి నుంచి నిరవధిక సమ్మె
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ (HCASE) నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు. సిబ్బంది ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న ఓవర్ టైమ్ (OT) బకాయిలు, గ్రౌండ్ సిబ్బందికి సంబంధించిన కన్వేయన్స్ అలవెన్సులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా, హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని వారు కోరుతున్నారు.
KVN Productions : కెవిఎన్ ప్రొడక్షన్ హౌస్‌కు వరుస తలనొప్పులు
Also Read
- Vijay Personal Life Controversy: మళ్లీ తెర పైకి విజయ్ వ్యక్తిగత జీవితం.. 27 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటాడా..?
- Tamil Nadu Election Results: విజయ్‌కి కాంగ్రెస్, వామపక్షాల మద్దతు..?
- Vijay Political Rise: రజనీ, కమల్‌కు సైతం సాధ్యం కాలేదు.. ప్రజానాయకుడిగా మారిన విజయ్.. తమిళ రాజకీయాల్లో సరికొత్త మార్పు..
- Tamil Nadu Election Results: సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తారా..? డీఎంకే చావుదెబ్బ కొట్టిన హిందువులు..
గతంలో మూడు నెలల పాటు జీతాలు లేకపోయినా సంస్థ కోసం అంకితభావంతో పనిచేశామని ఉద్యోగులు గుర్తుచేశారు. అయితే సమస్యల పరిష్కారం కోసం మేనేజ్‌మెంట్‌కు పలుమార్లు లేఖలు రాసినా స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా మెడికల్ రీయింబర్స్‌మెంట్లతో పాటు అందరికీ క్యాష్‌లెస్ ఆరోగ్య బీమా కల్పించాలని యూనియన్ డిమాండ్ చేసింది. ప్రస్తుతం అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇకపై ఓపిక నశించిందని సిబ్బంది భావోద్వేగంగా తెలిపారు. డిమాండ్లు నెరవేరే వరకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పనులను పూర్తిగా నిలిపివేస్తామని యూనియన్ స్పష్టం చేసింది. సమ్మె కారణంగా మ్యాచ్‌ల నిర్వహణకు అంతరాయం కలిగితే దానికి మేనేజ్‌మెంటే బాధ్యత వహించాలని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్‌డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్‌డేట్స్ మీకోసం..
-
Vijay Personal Life Controversy: మళ్లీ తెర పైకి విజయ్ వ్యక్తిగత జీవితం.. 27 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటాడా..?
-
Tamil Nadu Election Results: విజయ్‌కి కాంగ్రెస్, వామపక్షాల మద్దతు..?
-
TVK VIJAY : తమిళనాడు సీఎంగా విజయ్?.. జననాయగన్ రిలీజ్ కు లైన్ క్లియర్
-
Actor Vijay TVK: సినీ నుంచి రాజకీయాల వరకు దళపతి విజయ్ ప్రస్థానం.. సవాళ్లను అధిగమించి..
-
Rajasekhar: మొదట శ్రీదేవే పెళ్లి ప్రపోజల్ పెట్టింది.. కానీ
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!