Site icon NTV Telugu

Murali Mohan : సమయానికి స్పందించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలకం

Murali Mohan

Murali Mohan

Murali Mohan : హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో, అత్యవసర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో స్పందించే వ్యవస్థ అవసరం స్పష్టమవుతోంది. ఇటీవల పాతబస్తీలో జరిగిన విషాద అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఈ విషయంలో తీవ్ర ఆవశ్యకతను ముందుకు తెచ్చింది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నగరానికి ఫైర్‌ కమాండ్‌ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రావడం గణనీయమైన పరిణామంగా మారింది. ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ మాట్లాడుతూ నగరం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇటువంటి ఆధునిక సదుపాయాలు అత్యవసరమని, ఇటువంటి సెంటర్లు ఉంటే ప్రమాదాల సమయంలో సమయానికి స్పందించడం సాధ్యమవుతుంది. ఇది ప్రజల రక్షణకు చాలా ముఖ్యం అని వ్యాఖ్యానించారు.

Tata Altroz Facelift: బుకింగ్స్ ఓపెన్.. కేవలం రూ.21,000తో ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ సొంతం చేసుకోండి..!

ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే 101 కాల్ ద్వారా అది కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమవుతుందని తెలిపారు. బంజారాహిల్స్‌లోని మెయిన్ సెంటర్‌తో సహా ఈ వ్యవస్థ పనిచేస్తోందని, ఫైర్, పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, హెల్త్ తదితర విభాగాలు ఈ సెంటర్ ద్వారా అనుసంధానమై ఉంటాయ అని వివరించారు.

భవనాలకు సంబంధించిన ఫైర్ సేఫ్టీ అనుమతుల విషయంలో ఆటో క్యాడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వారం రోజుల్లో లోపాలను గుర్తించి అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. “ఫైర్ సేఫ్టీ సిస్టమ్ సక్రమంగా అమలవుతున్నదా అనే విషయాన్ని శాస్త్రీయంగా చెక్ చేసి, పరామితులు తీరితే అనుమతులు మంజూరు చేస్తాం,” అని పేర్కొన్నారు. పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వ్యాఖ్యానించలేమని డీజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఇది ఆ సందర్భానికి సంబంధించిన అంశం కాదని అన్నారు.

Nadendla Manohar: రేపు తెనాలికి వైఎస్ జగన్.. వాస్తవాలు తెలుసుకుని రావాలని మంత్రి సూచన

Exit mobile version