ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఒక హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని అంటే చాలా కష్టం. కానీ ఇలా ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి మంచి ఫేమ్ సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు అందులో తమన్నా ఒకరు. హీరోయిన్‌గా 20 యేళ్లు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో ఆడియన్స్‌ను మెప్పిస్తోంది. నార్త్ హీరోయిన్ అయిన తమన్నా, సౌత్ కథానాయికగా దక్షిణాది తో పాటు, ఉత్తరాది ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. కెరీర్ బిగినింగ్ లోనే టాలీవుడ్ స్టార్ హీరోలతో జతకట్టిన ఈ చిన్నది అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది.
ప్రజంట్ హీరోయిన్ గా నటిస్తూనే స్పెషల్ సాంగ్ తో అందాలు ఒలకబోస్తుంది. ఇటివల జైలర్ లో ‘కావాలాయ్యా’ పాటతో తమన్నా భాటియా స్పెషల్ నంబర్ల క్వీన్‌గా మారింది. ఆ తర్వాత ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కి రాత్’ మరో సంచలనంగా మారింది. తమన్నా డ్యాన్స్ కి యూత్ ఫిదా అయ్యారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మిల్క్ బ్యూటీ .. తన శరీరం పై తానే బోల్డ్ కామెంట్స్ చేసింది..
Also Read:Tandel: ‘తండేల్’ జాతరలో స్టెప్పులు వేసిన నాగ చైతన్య , సాయి పల్లవి
తమన్నా మాట్లాడుతూ.. ‘నా శరీరంలోని ప్రతి భాగాన్నికి, నా అందానికి ధన్యవాదాలు. నా శరీరాని చూసుకుని నేను ఎంతో మురిసిపోతాను, ఆనందిస్తాను,ఆరాధిస్తున్నాను. నేను నా శరీరంలోని ప్రతి భాగాన్ని తాకుతాను. అన్నిటినీ తట్టుకుని నా కోసం నిలబడుతునందుకు కృతజ్ఞతలు’ అని తెలిపింది. దీని బట్టి తన శరీర అందాన్ని కాపాడుకునేందుకు తమన్నా ఎంతగా పాటుపడుతుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే తన అందం, ఆకృతిపై ఎంత నమ్మకంగా ఉందో తెలుస్తోంది. ప్రజంట్ తమన్న మాటలు వైరల్ అవుతున్నాయి.
తమన్నా చెప్పినట్లుగానే ఇండస్ట్రీలో నిలబడాలి అంటే అందం చాలా ముఖ్యం. అందులో కలర్ చాలా ఇంపార్టెంట్ ఈ రెండు తమన్నాలో ఉన్నాయి. అందుకే తను ఇప్పటికి స్టార్ హీరోయిన్ హోదాలో ఉంది. డి గ్లామర్ ఉన్న హీరోయిన్‌లు కూడా చాలా మంది ఉన్నారు. వారు ఎంత సక్సెస్ అందుకున్న.. పడాల్సిన మాటలు మాత్రం పడుతూనే ఉంటారు. ఇలాంటి విషయాలు కొంచెం కలర్ తక్కువ ఉన్న హీరోయిన్ లు చాలా మంది పంచుకున్నారు.