సిద్దిపేటలో ఆదర్శ్ నగర్ స్ట్రీట్ నంబర్ 7 లో దారుణం చోటుచేసుకుంది. భార్య శ్రీలతపై అనుమానంతో భర్త ఎల్లయ్య కత్తితో పొడిచి చంపాడు. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, పిల్లలు కూడా తనకి పుట్టలేదన్న అనుమానంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్య శ్రీలత(35) ని కత్తితో పొడిచి చంపిన భర్త ఎల్లయ్య.. అనంతరం కూతురు(15), కొడుకు(12)పై కత్తితో దాడికి యత్నించాడు. తండ్రి దాడిలో తప్పించుకుని పారిపోయిన కుమారుడు. అనంతరం గడ్డి మందు తాగి కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు ఎల్లయ్య. కొన్నేళ్లుగా మద్యానికి బానిసై సైకోగా మారిన ఎల్లయ్య.. గత కొన్నేళ్లుగా తరచు బార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
Also Read:Kerala: బస్సులో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ.. వీడియో తీసిన యువతి.. తట్టుకోలేక ఆత్మహత్య(వీడియో)
నిన్న రాత్రి ఎలాగైనా భార్య, పిల్లల్ని చంపేయాలని కత్తి, గడ్డి మందు తీసుకుని వచ్చిన ఎల్లయ్య.. కత్తితో దాడి చేసి అప్పటికి చావకపోతే గడ్డి మందు పోసి హత్య చేయాలని ఎల్లయ్య ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఎల్లయ్యకి ఉరి శిక్ష వేయాలని మృతురాలి కుటుంబ సభ్యుల డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్పందించిన స్థానికులు గాయపడిన కూతురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో ఎల్లయ్య చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.