సిద్దిపేటలో ఆదర్శ్ నగర్ స్ట్రీట్ నంబర్ 7 లో దారుణం చోటుచేసుకుంది. భార్య శ్రీలతపై అనుమానంతో భర్త ఎల్లయ్య కత్తితో పొడిచి చంపాడు. అనంతరం కూతురిపై కత్తితో దాడి చేసి తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్పందించిన స్థానికులు గాయపడిన కూతురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో ఎల్లయ్య చికిత్స పొందుతున్నాడు. ఎల్లయ్య నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Siddipet: సిద్దిపేటలో దారుణం.. భార్యపై అనుమానంతో కత్తితో పొడిచి చంపిన భర్త

Siddipet