NTV Telugu Site icon

Fire Accident : మొగుడు పెళ్లాన్ని విడదీద్దామని వచ్చారు.. మంటల్లో కాలిపోయారు

Fire Accident

Fire Accident

Fire Accident : గొడవ పడుతున్న భార్యాభర్తలను విడదీద్దామని ఇరుగుపొరుగు వారు వచ్చారు. ఇంతలోనే ఏర్పడిన భారీ అగ్నిప్రమాదంలో చిక్కుకు పోయారు. దంపతుల మధ్య ఏదో కారణాల వల్ల గొడవ జరిగింది. ఈ వివాదం నుంచి భార్యను తప్పించాలనే ఉద్దేశంతో బెదిరిద్దామనుకుని భర్త ఇంట్లో గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్‌ను ఆన్ చేశాడు. దీంతో ఇంటినిండా గ్యాస్ వ్యాపించింది. ఈ విషయం తెలుసుకున్న భార్య గట్టిగా కేకలు వేసింది. భార్య అరుపులు విన్న బంధువులు, ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చి రెగ్యురేటర్ స్విచాఫ్ చేశారు. అయితే భర్త లైటర్‌ వెలిగించడంతో గ్యాస్‌ ఇంట్లోకి వ్యాపించి మంటలు చెలరేగాయి. ఇల్లంతా మంటల్లో కాలిపోయింది. ఇందులో భార్యతోపాటు సాయం చేసేందుకు వచ్చిన బంధువులు, ఇరుగుపొరుగుతో సహా 10మంది చనిపోయారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read Also: Pragya Thakur: విదేశీ స్త్రీకి పుట్టినవారు ఎప్పటికీ దేశభక్తుడు కాలేడు.. రాహుల్ గాంధీని దేశం నుంచి తరిమేయాలి.

ఈ ఘటన ఘజియాబాద్ ప్రాంతంలోని తిలక్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. నిప్పంటించిన నిందితుడి భర్త పేరు సురేష్. సురేష్ తన భార్యను చంపేస్తానని బెదిరించాడని పోలీసులు తెలిపారు. గదిని గ్యాస్‌తో నింపిన ఎల్‌పిజి గ్యాస్ పైపును రాగా లాగాడు. గ్యాస్ వ్యాపించడంతో సహాయం కోసం రీతూ కేకలు వేసింది. దీంతో ఇతర కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని గ్యాస్‌ రెగ్యులేటర్‌ ఆఫ్‌ చేశారు. ఇంతలో సురేష్ గ్యాస్ లైటర్ వెలిగించడంతో గదిలో మంటలు చెలరేగి ఇంట్లోని సామాన్లు కాలిపోయాయి.

Read Also:Kandru Kamala: వైసీపీకి షాక్‌.. జనసేన మీటింగ్‌కి మాజీ ఎమ్మెల్యే..

క్షతగాత్రులందరినీ ఈశాన్య ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మరో మహిళతో అక్రమ సంబంధం కారణంగా నిందితుడు మానసిక సమతుల్యం కోల్పోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.