Site icon NTV Telugu

Husband Killed Wife: దారుణం.. భార్యను అతికిరాతకంగా రోకలిబండతో కొట్టి చంపిన భర్త

Crime News

Crime News

Husband Killed Wife: తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వివాహేతర సంబంధాల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అక్రమసంబంధం మోజులో పడి.. కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. అంతా అయిపోయాక తిరిగి చూసుకుంటే.. ఏమీ మిగలకుండా అయిపోతుంది. అయిన వాళ్లు దూరమవుతున్నారు. కట్టుకున్న వాళ్లు తిరిగి రానిలోకాలకు వెళ్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం బొర్రపోతుపాలెంలో దారుణం జరిగింది. అనుమానంతో కట్టుకున్న భార్యను అతికిరాతకంగా హత్య చేశాడు ఓ కసాయి భర్త.

Read Also: Bear Attack: అందుకే అదుపులో ఉండాలనేది.. రెప్పపాటులో మహిళపై ఎలుగుబంటి దాడి..

భార్య కాగిత శివ నాగరాణి(30)పై అనుమానంతో రోకలిబండతో తలపై కొట్టి కిరాతకంగా హత్య చేశాడు. తలపై రోకలిబండతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే నాగరాణి ప్రాణాలు విడిచింది. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిందితుడు, భర్త నాగరాజును మచిలీపట్నం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానంతో హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. నాగరాజుపై కేసు నమోదు చేసి మచిలీపట్నం రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ముగ్గురు పిల్లలకు తల్లి లేకుండా పోయింది.

Exit mobile version