కొన్నిసార్లు ప్రజలు జూ జంతువుల వద్ద చిలిపి చేష్టలు చేస్తుంటారు. కొన్నిసార్లు జంతువులకు సంబంధించి అనేక ఘటనలకు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ స్త్రీని చూడగానే ఎలుగుబంటి రెచ్చిపోయింది. చివరికి ఏమైందో ఓసారి చూస్తే..
Read Also: Shocking Video: వామ్మో.. ఈయన ఎవరండీ బాబు.. పుచ్చకాయ కొనకపోతే ఏం చేస్తాడేమో ఏంటో..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ జూ యొక్క ఎలుగుబంటి ఎన్‌క్లోజర్ లో ఒక వ్యక్తి మరొక స్త్రీకి శిక్షణ ఇస్తాడు. స్త్రీ తన చేతిని పైకెత్తి ఎలుగుబంటికి ఆజ్ఞాపిస్తుండగా ఈ క్రమంలో ఎలుగుబంటి రెచ్చిపోతుంది. ఎలుగుబంటిని గొలుసుతో బంధించినా.. గట్టిగా పట్టుకొని దగ్గరకు లాగింది. దాంతో అలర్ట్ అయిన ఇంతలో మరో ఇద్దరు వ్యక్తులు, ఓ బాటసారి అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని తరిమేశారు.
అందులో ఓ వ్యక్తి కర్రతో బలంగా కొట్టడంతో ఎలుగుబంటి భయపడి పారిపోయింది. దీంతో మహిళ సురక్షితంగా బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. ఇంటర్నెట్ వినియోగదారులు ఈ అంశంపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇంకెందుకు అల్లాస్యం ఈ భయంకరమైన వీడియోను మీరు వీక్షంచండి.
— Fck Around N Find Out (@FAFO_TV) May 15, 2024