NTV Telugu Site icon

Krishna District: భార్యను హతమార్చిన భర్త.. ఆస్తి వివాదాలే కారణం..!

Husband

Husband

కృష్ణా జిల్లా బందరులో భార్యను హతమార్చిన కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. డాక్టర్ రాధ హత్య కేసులో భర్తే కాల యముడు అయ్యాడు. ఈ ఘటనలో హంతకుడు భర్త డాక్టర్ మహేశ్వర రావు, డ్రైవర్ మధును పోలీసులు అరెస్ట్ చేశారు.

Nandamuri Balakrishna: జైలర్ లో బాలయ్య.. థియేటర్లు తగలబడిపోతాయి

వివరాల్లోకి వెళ్తే.. ఆస్తి వివాదాల కారణంగా కట్టుకున్న భార్యనే కాటికి పంపించాడు ఓ భర్త. పేరుకు చేసేది డాక్టర్ పని.. చేసేది మాత్రం హతమార్చడం. భార్య రాధ హత్యకు 3 నెలల క్రితమే భర్త మహేశ్వరరావు స్కెచ్ వేశాడు. ఆసుపత్రిలోనే ఆక్సిజన్ సిలిండర్ బిగించే రెంచ్ తో హత్య చేశాడు. అతి దారుణంగా తలపై దాడి చేసి చంపేశాడు భర్త మహేశ్వరరావు. అయితే ఈ హత్యకు అతని డ్రైవర్ కూడా సహాయపడ్డాడు. డ్రైవర్ మధుతో కలిసి రాధ హత్యకు ప్లాన్ వేసుకున్నారు. అయితే భార్య రాధను హత్య చేసిన ఆస్పత్రిలోనే భర్త మహేశ్వరరావు కూడా అదే ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తాడు.

Supreme Court: ‘ఇండియా’ పేరుపై పిటిషన్‌.. తిరస్కరించిన సుప్రీంకోర్టు

మరోవైపు ఎవరికి అనుమానం రావొద్దని.. హత్య జరిగిన స్థలంలో నిందితుడు కారం చల్లాడు. రాధను హత్య చేసిన తర్వాత తీరిగ్గా స్థానిక సూపర్ బజార్ కు వెళ్లి.. డ్రైవర్ మధు కారం ప్యాకెట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత భర్త రాధ మృతదేహంపై చల్లాడు. అంతేకాకుండా తన భార్య హత్యకు సహాయం చేస్తే రూ. 35 లక్షలు నగదు, బంగారం ఇచ్చి లైఫ్ సెటిల్ మెంట్ చేస్తానని డ్రైవర్ కు చెప్పాడు భర్త మహేశ్వరరావు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.