NTV Telugu Site icon

Human Trafficking: ఉద్యోగాల పేరుతో మాయ.. ఏపీ, పశ్చిమ బెంగాల్‌ నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్

Human Trafficking

Human Trafficking

Human Trafficking: ఉద్యోగం ఆశ చూపించి మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్లు వారు తెలిపారు. ఏపీ నుంచి 150 మందికి పైగా తరలించినట్టు గుర్తించామని విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్ వెల్లడించారు. దాదాపు 5 వేల మంది వివిధ దేశాల్లో యువత వారి చేతిలో ఉన్నట్టు నిర్దారించామని తెలిపారు.

Read Also: Students Missing: తీవ్ర విషాదం.. స్నానానికి వెళ్లి గోదావరిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు

ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ⁠ ఫెడెక్స్ , టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలు చేయడంలో ఈ అమాయకులని వాడుకుంటున్నారని విశాఖ సీపీ పేర్కొన్నారు. ఇక్కడ నుంచి కంబోడియాకు వీరిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని..⁠ నిరుద్యోగుల వద్ద నుంచి లక్షన్నర వరకు వసూలు చేశారని ఆయన చెప్పారు. 80 వేల రూపాయలు అందులో కంబోడియా దేశంలో ఏజెంట్‌కి ఇస్తారని చెప్పుకొచ్చారు. డేటా ఎంట్రీ ఉద్యోగాలు అని చెప్పి ఆన్ లైన్ స్కాంలు చేయాలని వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారని సీపీ రవిశంకర్ అయ్యన్నార్‌ వెల్లడించారు. నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం అనగానే మోసపోవద్దని ఆయన సూచించారు. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

Show comments