TS 6 Guarantees: ప్రజాపాలనకు భారీ స్పందన.. తొలిరోజే 7.46 లక్షల దరఖాస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS 6 Guarantees: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీల అమలు దిశగా తీవ్ర కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆరు హామీలకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ ప్రజా పరిపాలన కార్యక్రమానికి తొలిరోజు భారీ స్పందన వచ్చింది. ఉదయం నుంచే ప్రజలు దరఖాస్తులు ఇచ్చేందుకు కేంద్రాల వద్ద బారులు తీరారు. తొలిరోజు 7.46 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ‘అభయహస్తం’ కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్ల వంటి ఆరు హామీ పథకాలకు అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వీటన్నింటికీ రేషన్ కార్డులు జత చేయాలని అధికారులు సూచించారు. అయితే రేషన్ కార్డులు లేని వారు తెల్లకాగితాలపై అర్జీలు ఇవ్వాలని అధికారులు తెలిపారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 7,46,414 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీతోపాటు గ్రామాల్లో 2,88,711, పట్టణ ప్రాంతాల్లో 4,57,703 ఉన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
Read also: Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు!
Also Read
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. 'పెరి పెరి మసాలా'ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
- Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
- Virat Kohli Records: "నువ్వు మామూలోడివి కాదు సామీ".. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
నిన్న (గురువారం) ప్రారంభమైన ఈ ప్రజాపరిపాలన కార్యక్రమం జనవరి 6 వరకు కొనసాగనుంది. దరఖాస్తుదారులలో ఎక్కువ మంది మహిళలు. చాలామంది తమ భార్యల పేరుతో దరఖాస్తు చేసుకున్నారు. గ్రామాలు, వార్డులు, డివిజన్ల వారీగా ఈ సమావేశాలు నిర్వహించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తొలిరోజు జరిగిన సమావేశాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ 6 హామీలకు సంబంధించిన ప్రజా పరిపాలన దరఖాస్తు ఫారాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. చాలా మంది ఇంటి వద్ద వాటిని నింపి గ్రామ, వార్డు, డివిజన్ సమావేశాల్లో ప్రదర్శించారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని 141 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపల్ కార్పొరేషన్లలోని 2,258 కేంద్రాల్లో ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజాపరిపాలన కార్యక్రమాన్ని సమీక్షించారు. ప్రతి కేంద్రంలో తగిన దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలన్నారు.
Canada : కెనడాలోని హిందూ దేవాలయాలపై దాడి.. హుండీల దొంగ దొరికేశాడు
తాజావార్తలు
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
-
Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!