Jasmin Bhasin: స్టంట్ చేస్తూ జ్ఞాపకశక్తి కోల్పోయిన నటి.. బిత్తరపోయిన షో నిర్వాహకులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasmin Bhasin: ప్రముఖ టీవీ నటి జాస్మిన్ భాసిన్ స్టంట్ బేస్డ్ రియాలిటీ షో ‘ఖత్రోన్ కే ఖిలాడి’ సీజన్ 15లో ఒక భయంకరమైన ప్రమాదానికి గురై తాత్కాలికంగా జ్ఞాపకశక్తిని కోల్పోయారు. షోలో భాగంగా నీరు, గాలితో కూడిన ఒక కఠినమైన యాక్షన్ స్టంట్ చేస్తుండగా, ఆమె ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోవడంతో తలకు స్వల్ప గాయం అయింది. ఈ ప్రమాదం కారణంగా స్టంట్ ముగిసిన వెంటనే ఆమెకు కొన్ని గంటల పాటు అసలు ఏం జరిగిందనే విషయం గుర్తుకు రాకపోవడంతో హోస్ట్ రోహిత్ శెట్టితో పాటు షోలో ఉన్నవారు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ స్టంట్ గురించి ఇప్పటికీ తనకు ఏమీ గుర్తులేదని జాస్మిన్ చెప్పడం ఈ ఘటనను మరింత చర్చనీయాంశంగా మార్చింది.
స్టంట్ ముగిసిన తర్వాత రోహిత్ శెట్టిని కలిసిన జాస్మిన్ పదేపదే తనకు ఏం జరిగిందో గుర్తులేదని చెబుతుండటంతో అక్కడున్న వారంతా కంగారుపడ్డారు. ఆమె ముఖంలో అయోమయం కనిపించగా, రోహిత్ ఆమెను ప్రశాంతంగా ఉండమని ధైర్యం చెప్పారు. వెంటనే షో వైద్య బృందం రంగంలోకి దిగి పరీక్షలు నిర్వహించి, తాత్కాలిక జ్ఞాపకశక్తి లోపం వచ్చినట్లు గుర్తించింది. అనంతరం ఆమెకు మూడు రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించింది.
Also Read
- Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
- Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
- Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
- Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
ఈ ఘటనపై తర్వాత జాస్మిన్ కూడా స్పందించారు. ఆ స్టంట్ తన జీవితంలో అత్యంత విచిత్రమైన అనుభవాల్లో ఒకటిగా నిలిచిందని చెప్పారు. ఇప్పటికీ ఆ క్షణంలో ఏం జరిగిందో తనకు గుర్తులేదని, ఆ విషయం గురించి తానే ఆశ్చర్యపోతున్నానని వెల్లడించారు. తనను వెంటనే వైద్య సహాయం అందించి జాగ్రత్తగా చూసుకున్న రోహిత్ శెట్టి, షో నిర్వాహకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘ఖత్రోన్ కే ఖిలాడి 15’ వరుసగా మూడో వారమూ స్టంట్ల కారణంగానే చర్చలో నిలవడం గమనార్హం. తొలి వారంలో పెల్లెట్ గన్ టాస్క్‌పై విమర్శలు వెల్లువెత్తగా, గత వారం పోటీదారుల చేతులపై వేడి మైనం పోసిన స్టంట్ సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఇప్పుడు జాస్మిన్‌కు జరిగిన ఈ ఘటనతో షోలో భద్రతా ఏర్పాట్లపై మరోసారి చర్చ మొదలైంది.
ఇక జాస్మిన్ భాసిన్ విషయానికి వస్తే.. టెలివిజన్ రంగంతో పాటు సౌత్, పంజాబీ చిత్ర పరిశ్రమలలో పలు క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటించారు. తెలుగులో అల్లరి నరేష్ సరసన ‘3G లవ్’ తో పాటు ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ చిత్రాలలో నటించిన ఆమె, హిందీ టెలివిజన్ రంగంలో ‘తషన్-ఎ-ఇష్క్’, ‘దిల్ సే దిల్ తక్’ ప్రసిద్ధ సూపర్‌నేచురల్ సిరీస్ ‘నాగిన్ 4’ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రియాలిటీ షోలు అయిన బిగ్ బాస్ 14 (Bigg Boss 14), ది ట్రేటర్స్ ఇండియా లలో కంటెస్టెంట్‌గా అలరించిన జాస్మిన్, ప్రస్తుతం పంజాబీ సినిమాలపై దృష్టి పెట్టారు. ఆమె కథానాయికగా నటించిన తాజా పంజాబీ చిత్రం ‘జుదా’ 2026 ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కాబోతోంది.
- Tags
- cinema
- Jasmin Bhasin
తాజావార్తలు
-
Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
-
Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!