Online Gaming Fraud: హైదరాబాద్ లో ఆన్‌లైన్ గేమింగ్ మాఫియా గుట్టురట్టు.. ఏకంగా రూ.13,000 కోట్ల మోసం
- హైదరాబాద్ లో ఆన్‌లైన్ గేమింగ్ మాఫియా గుట్టురట్టు
- ఏకంగా రూ.13,000 కోట్ల మోసం
- పంకజ్ కుమార్ కీలక పాత్ర పోషించినట్లు డీజీజీఐ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్‌లైన్ గేమింగ్ అక్రమ వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం (డీజీజీఐ) కీలక పురోగతి సాధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న అడ్సమ్ అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ పంకజ్ కుమార్‌ను హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ సంస్థ ప్రధానంగా మోసాల గుర్తింపు, కస్టమర్ వెరిఫికేషన్, డిజిటల్ కేవైసీ సేవలను అందిస్తున్నట్లు గుర్తించారు.
Also Read:BMW CE 02: బీఎండబ్య్లూ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ. 2 లక్షల డిస్కౌంట్.. రిలీజైన ఏడాదిన్నరకే ఎందుకిలా?
Also Read
దర్యాప్తులో సేకరించిన ఆధారాల ప్రకారం సుమారు రూ.13,000 కోట్ల విలువైన ఒక పెద్ద సంఘటిత ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్ దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ నెట్‌వర్క్‌కు అనుబంధంగా పేమెంట్ అగ్రిగేటర్లు, పేమెంట్ గేట్‌వేలు, మూడో పార్టీ టెక్నాలజీ సేవా సంస్థలు సహకరించినట్లు అధికారులు గుర్తించారు. ఆర్బీఐ నియంత్రణలో ఉన్న సంస్థల తరఫున వ్యాపారులకు, షెల్ కంపెనీలకు మోసపూరిత కేవైసీ ధృవీకరణలు చేయడంలో పంకజ్ కుమార్ కీలక పాత్ర పోషించినట్లు డీజీజీఐ వెల్లడించింది.
కేవైసీ ప్రక్రియ నిర్వహించే సంస్థ డైరెక్టర్‌గా ఉన్నప్పటికీ, వినియోగదారుల యాజమాన్యం, నియంత్రణ నిర్మాణాల ఆధారంగా రిస్క్ ప్రొఫైలింగ్ చేయడంలో విఫలమయ్యారని దర్యాప్తులో తేలింది. యూపీఐ ఇంటిగ్రేషన్ కోసం షెల్ సంస్థలను ఆన్‌బోర్డ్ చేయడంలో ఆయన సహకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మార్గం ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా వచ్చిన అక్రమ డబ్బు ప్రవాహానికి వీలు కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ ఆదాయంలో ఆయన కూడా లబ్ధిదారుడిగా ఉన్నట్లు వెల్లడించారు.
Also Read:Donald Trump: 11 యుద్ధ విమానాలు కూలిపోయాయి.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట..
2025 సంవత్సరానికి భారతదేశంలోని ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ మొత్తం విలువ సుమారు 23 బిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రెండు లక్షల కోట్లు)గా అంచనా. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్లపై డీజీజీఐ హైదరాబాద్ విభాగం భారీ స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. అనుబంధ ఫిన్‌టెక్ సంస్థలపై చర్యలు తీసుకోవడంతో పాటు సుమారు రూ.100 కోట్ల విలువైన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి, కీలక మాస్టర్‌మైండ్‌లను అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!