Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- పాకిస్తాన్ చర్చలకు వచ్చినా దాడులు చేశాము..
- ఆపరేషన్ సిందూర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీడీఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ చర్చలు జరపాలని భారత్‌ను సంప్రదించినా దాడులు చేసినట్లు మాజీ CDS జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉదయం సుమారు 10 గంటల సమయంలో చర్చల కోసం ఫోన్ చేసిందని, ఆ సమయంలో భారత వైమానిక దళం చీఫ్ సర్గోధాపై దాడి చేయాలా అని తనను అడిగార, అందుకు తాను ‘‘గో ఎహెడ్’’ అని అనుమతి ఇచ్చారని వెల్లడించారు. ఇదే కాకుండా మరో రెండు టార్గెట్లను గుర్తించాలని కోరినట్లు తెలిపారు. వాటిలో ఒకటి పీఓకేలోని స్కార్దుపై దాడికి కూడా అనుమతించినట్లు చెప్పారు. వాతావారణ బాగా లేకపోవడం వల్ల ఆ దాడిని భోలారికి మార్చాల్సి వచ్చిందన్నారు.
ఆపరేషన్ సిందూర్‌లో భారత్ రూపొందించుకున్న ఎస్కలేషన్ మ్యాట్రిక్స్లో కీలక సూత్రం ఉందని చౌహాన్ చెప్పారు. చివరి దాడి లేదా విజయాన్ని నిర్ణయించే దాడి ఎప్పుడూ మన నుంచే ఉండాలని, పాకిస్తాన్ నుంచి కాదని ఇదే తమ వ్యూహంలో ముఖ్య సూత్రమని చెప్పారు. ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగితే, వాటికి అనుగుణంగా తదుపరి దశలకు వెళ్లేలా భారత సైన్యం ముందుగానే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం తక్కువ ఎత్తులో ఉన్న గగనతలాన్ని వినియోగించడాన్ని ప్రత్యేక వ్యూహంగా ఎంచుకుందని చౌహాన్ చెప్పారు. ఉరీ ఉగ్రదాడి తర్వాత భారత్ గ్రౌండ్ ఆపరేషన్ చేసిందని, పుల్వామా తర్వాత పెద్ద స్థాయి వైమానిక దాడులు జరిగాయని గుర్తు చేసిన ఆయన, ఆపరేషన్ సిందూర్ సమయంలో మూడో మార్గంగా తక్కువ ఎత్తులోని గగనతలాన్ని వినియోగించినట్లు వివరించారు. దీని వల్ల సంఘర్షణ స్థాయిని నియంత్రణలో ఉంచడంతో పాటు విజయావకాశాలను పెంచి ప్రత్యర్థికి షాక్ కలిగించవచ్చని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్‌లో భారత్ విజయానికి మెరుగైన సిట్యుయేషనల్ అవేర్నెస్, బ్యాటిల్‌ఫీల్డ్ ట్రాన్స్పరెన్సీ, మూడు దళాల మధ్య మెరుగైన నెట్వర్కింగ్ ప్రధాన కారణాలని చౌహాన్ తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు దళాలకు ఒకే విధమైన కామన్ ఆపరేషన్ పిక్చర్ అందుబాటులో ఉండటంతో మెరుగైన నిర్ణయాలు తీసుకోగలిగామని చెప్పారు. రాజకీయ నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం కూడా కీలకమైందని, దీంతో ఆపరేషన్ ప్రణాళిక చేసుకునేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ లభించిందని తెలిపారు.
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!